రాజా సాబ్ ఇద్దరు బ్యూటీల మధ్య పోటీ..?
మాళవిక ఓ పక్క, నిధి అగర్వాల్ మరోపక్క ఇద్దరు తమ పర్ఫార్మెన్స్ తో అలరిస్తారని తెలుస్తుంది.
By: Tupaki Desk | 13 Jun 2025 10:15 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అందులో ఒకరు మాళవిక మోహనన్ కాగా.. మరొకరు నిధి అగర్వాల్. ఈ ఇద్దరు భామలు కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ ఈ ఇయర్ డిసెంబర్ రిలీజ్ లాక్ చేసుకుంది. ఐతే ఈ సినిమాలో కథ పరంగా ఇద్దరి హీరోయిన్స్ కి మంచి పాత్రలు పడినట్టు తెలుస్తుంది.
మాళవిక ఓ పక్క, నిధి అగర్వాల్ మరోపక్క ఇద్దరు తమ పర్ఫార్మెన్స్ తో అలరిస్తారని తెలుస్తుంది. అంతేకాదు ఇద్దరి హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ ఉండేలా ఉందని అంటున్నారు. సినిమాలో బలమైన పాత్రల్లో ఇద్దరు అందగత్తెలు నటిస్తున్నారు. సో తప్పకుండా ఈ పాత్రల్లో తమ బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తారు. మాళవిక తన గ్లామర్ తో పాటు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్ర చేస్తుందట. నిధి కూడా సినిమాలో కీలక రోల్ చేస్తుందని తెలుస్తుంది.
ఐతే మారుతి ఈ ఇద్దరు హీరోయిన్స్ ని ఎలా చూపించాడు అన్నది ఆడియన్స్ లో కూడా చర్చ నడుస్తుంది. ఐతే స్టార్ హీరో పాన్ ఇండియా హీరో ఇలాంటి థ్రిల్లర్ సినిమా చేయడం గొప్ప విషయం. తప్పకుండా సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా రాజా సాబ్ ఉంటుందని అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న రాజా సాబ్ సినిమాతో మరోసారి ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.
ప్రభాస్ రాజా సాబ్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా కొన్నాళ్లుగా ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఐతే త్వరలో టీజర్ రాబోతున్న సందర్భంగా రెబల్ ఫ్యాన్స్ అంతా కూడా అలర్ట్ అవుతున్నారు. టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించేలా ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు మారుతి. మరి డైరెక్టర్ గా మారుతికి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి అతను కూడా ఈ సినిమాపై చాలా ఫోకస్ తో పనిచేస్తున్నాడు. ప్రభాస్ సినిమానే అతని సినిమా రికార్డులు కొల్లగొడుతున్నాయి. కల్కి 2898 ఏడితో నెలకొల్పిన రికార్డులను రాజా సాబ్ తో చెరిపేసి కొత్త రికార్డులు సృష్టించాలని చూస్తున్నాడు రెబల్ స్టార్.
