స్పిరిట్ : సందీప్ వంగ రెడీగా ఉన్నట్లేనా..?
ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజా సాబ్' సినిమా ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది.
By: Tupaki Desk | 29 July 2025 1:00 AM ISTప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజా సాబ్' సినిమా ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది. ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల చేయడం ఖాయం అంటూ అధికారికంగా ప్రకటన చేసి క్యాన్సల్ చేశారు. 2025లో రాజాసాబ్ ఉందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో మేకర్స్ నుంచి సినిమా డిసెంబర్‌లో రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. 2025 డిసెంబర్ 5న రాజాసాబ్ రావడం దాదాపుగా కన్ఫర్మ్. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన రాజాసాబ్ ను మరింత ఆలస్యం చేయాలని మారుతి అనుకోవడం లేదు. అందుకే ఈ ఏడాదిలో ప్రభాస్ మూవీ రావడం కన్ఫర్మ్.
రాజాసాబ్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ 'ఫౌజీ'. హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఎప్పటిలాగే విభిన్నమైన సినిమాగా ఫౌజీ ను హను రూపొందిస్తున్నాడు. ప్రభాస్ ఈ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా పూర్తిగా ఫౌజీ కి ప్రభాస్ సమయం కేటాయిస్తున్నాడు. కనుక షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఫౌజీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను ప్రభాస్ చేయాల్సి ఉన్న విషయం తెల్సిందే.
స్పిరిట్ సినిమాను ఇదుగో.. అదుగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. గత ఏడాదిలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తాను అంటూ దర్శకుడు సందీప్ వంగ ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కలేదు. ఇటీవల విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ వంగ 'స్పిరిట్' గురించి స్పందించాడు. ఆ సమయంలో సందీప్ వంగ మాట్లాడుతూ స్పిరిట్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పట్టాలెక్కించబోతున్నట్లు ప్రకటించాడు. స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభంకు ఏర్పాట్లు చేస్తున్నామని దర్శకుడు సందీప్ చెప్పాడు. కానీ ప్రభాస్‌కి ప్రస్తుతం ఆ రెండు సినిమాలతో ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభాస్ నుంచి లైన్ క్లియర్ రావాల్సి ఉంది. ఇదే సమయంలో సందీప్ కిషన్ నుంచి లైన్ క్లియర్‌గా ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను లాక్ చేశాడా అనేది అధికారికంగా చెప్పడం లేదు. అంతే కాకుండా నటీనటుల ఎంపిక విషయంలో తుది నిర్ణయం తీసుకున్నారా అనే విషయంలోనూ స్పష్టత లేదు. సందీప్ రెడ్డి వంగ ఇప్పటి వరకు టెక్నీషియన్స్ అందరినీ అనౌన్స్ చేయలేదు. కొద్ది మంది పేర్లను మాత్రం ప్రకటించాడు. కనుక ప్రభాస్ ఆలస్యం చేయడంతో పాటు సందీప్ వంగ వైపు నుంచి కూడా స్పిరిట్ ఆలస్యంకు కారణం ఉందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ నుంచి బయటకు వచ్చేప్పటి వరకు సందీప్ వంగ రెడీగా ఉండాలని అభిమానులు కోరుతున్నారు.
