'యానిమల్' రూట్లో రాజా సాబ్.. మ్యాజిక్ వర్కవుట్ అయ్యేనా?
ఈ మధ్య కాలంలో ఆడియెన్స్ మైండ్ సెట్ మారింది. కంటెంట్ లో దమ్ముంటే మూడు గంటలైనా కదలకుండా కూర్చుంటున్నారు.
By: Tupaki Desk | 24 Dec 2025 3:09 PM ISTఈ మధ్య కాలంలో ఆడియెన్స్ మైండ్ సెట్ మారింది. కంటెంట్ లో దమ్ముంటే మూడు గంటలైనా కదలకుండా కూర్చుంటున్నారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్', 'ఆర్ఆర్ఆర్' సినిమాలే ఇందుకు సాక్ష్యాలు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ 'రాజా సాబ్' కూడా ఇదే ధైర్యం చేస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ నుంచి హై వోల్టేజ్ సినిమాలు వచ్చాయి. కానీ డార్లింగ్ ని ఫన్ మోడ్ లో చూసి చాలా కాలమైంది. దీంతో మారుతి ఆ వింటేజ్ ప్రభాస్ ను తెరపై చూపిస్తాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సెన్సార్ రిపోర్ట్ ప్రకారం 'రాజా సాబ్' నిడివి ఏకంగా 3 గంటల 6 నిమిషాలు అని తెలుస్తోంది. క్రెడిట్స్ తీసేసినా సినిమా రన్ టైమ్ దాదాపు 3 గంటలు ఉంటుందట. ఒక హర్రర్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ జానర్ సినిమాకు ఈ రేంజ్ రన్ టైమ్ అంటే చిన్న విషయం కాదు. ఇది కాస్త రిస్కీ టెస్ట్. కథలో ఇంటెన్సిటీ తగ్గితే ఆడియెన్స్ అసహనానికి గురయ్యే ఛాన్స్ ఉంది.
అయితే సినిమా ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ నిడివి చాలా ఎక్కువట. ఏకంగా గంటా 43 నిమిషాలు ఇంటర్వెల్ తర్వాతే ఉంటుందని టాక్. సాధారణంగా సెకండాఫ్ క్రిస్ప్ గా, వేగంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మారుతి మాత్రం రివర్స్ గేర్ లో సెకండాఫ్ మీదే భారీగా టైమ్ కేటాయించాడని తెలుస్తోంది. ఆడియెన్స్ ను సీట్లకు కట్టిపడేసే అసలు మ్యాజిక్ అక్కడే దాచారట.
సెకండాఫ్ అంత సేపు ఎందుకు సాగింది అంటే.. సినిమాలో అసలు కథ, ప్రభాస్ పీక్ ఎలివేషన్స్, కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అన్నీ ద్వితీయార్థంలోనే ఉన్నాయట. ఫస్టాఫ్ అంతా ఫన్ గా, లైటర్ వెయిన్ లో నడిపించి.. సెకండాఫ్ లో ఎమోషన్, హారర్ ఎలివేషన్స్ తో కొట్టే ప్లాన్ లో ఉన్నారు. సెకండాఫ్ క్లిక్ అయితే సంక్రాంతి విన్నర్ రాజా సాబ్ అవుతుందని యూనిట్ బలంగా నమ్ముతోంది.
అయితే 'యానిమల్' లాంటి ఇంటెన్స్ డ్రామాను 3 గంటలు భరించడం వేరు.. 'రాజా సాబ్' లాంటి ఎంటర్టైనర్ ను చూడటం వేరు. కామెడీ టైమింగ్, హర్రర్ ఎలిమెంట్స్ ఏమాత్రం మిస్ ఫైర్ అయినా, ల్యాగ్ అనిపిస్తే ఈ రన్ టైమ్ మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ వింటేజ్ ప్రభాస్ ఎనర్జీ స్క్రీన్ మీద కనిపిస్తే టైమ్ తెలియదు అనేది ఫ్యాన్స్ నమ్మకం. ప్రస్తుతం ప్రమోషన్స్ కాస్త డల్ గా ఉన్నా, కంటెంట్ మీద టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది. త్వరలో జరగబోయే ఒకే ఒక్క గ్రాండ్ ఈవెంట్ తో బజ్ మొత్తం మార్చేయాలని చూస్తున్నారు. మరి ఈ 3 గంటల ప్రయోగం సంక్రాంతికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
