Begin typing your search above and press return to search.

డార్లింగ్ హెయిర్ స్టైల్‌పై నెట్టింట చ‌ర్చ‌!

మ‌ళ్లీ డార్లింగ్ ఒరిజిన‌ల్ లుక్‌లోకి వ‌చ్చేశాడ‌ని హ్యాపీగా ఫీల‌వుతున్నారు.

By:  Tupaki Desk   |   11 July 2025 5:29 PM IST
డార్లింగ్ హెయిర్ స్టైల్‌పై నెట్టింట చ‌ర్చ‌!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ య‌మ బిజీగా గ‌డిపేస్తున్నాడు. మారుతి డైరెక్ష‌న్‌లో `ది రాజాసాబ్‌`, హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్న `ఫౌజీ`ల‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ప్ర‌స్తుతం `ది రాజాసాబ్‌` షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. త‌మ‌న్నా పాల్గొన‌గా ప్ర‌భాస్‌పై ఓ స్పెష‌ల్ సాంగ్‌ని షూట్ చేయ‌బోతున్నారు. ఇదిలా ఉంటే గ‌త కొంత కాలంగా ప్ర‌భాస్ లుక్‌, హెయిర్ స్టైల్‌పై ఫ్యాన్స్ ఫీల‌వుతున్న విష‌యం తెలిసిందే.

డార్లింగ్ ప్ర‌భాస్ త‌న ఒరిజిన‌ల్ లుక్‌ని చూపించ‌డం లేద‌ని, `రాధేశ్యామ్‌` టైమ్‌లో ముఖంలో ఓల్డ్ ఛామ్ క‌నిపించ‌ట్లేద‌ని, ప్ర‌భాస్ లుక్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేద‌ని ఈ విమ‌ర్శ‌లు మ‌రింత‌గా వినిపించాయి. ఇన్నాళ్ల‌కు తాజాగా ప్ర‌భాస్ త‌న ప‌ర్‌ఫెక్ట్ లుక్‌తో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. డార్లింగ్ రియ‌ల్ కూల్ లుక్ ఇది క‌దా అని సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఎన్నాళ్ల కెన్నాళ్ల‌కు ఆ అదృష్టం ద‌క్కింది అంటూ మురిసిపోతున్నారు.

`బాహుబ‌లి` రీ యూనియ‌న్ సంద‌ర్భంగా క‌నిపించిన ప్ర‌భాస్ లుక్ చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. మ‌ళ్లీ డార్లింగ్ ఒరిజిన‌ల్ లుక్‌లోకి వ‌చ్చేశాడ‌ని హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ప్ర‌భాస్ లుక్‌పై ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం త‌మ కామెంట్‌ల‌తో క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నారు. ప్ర‌భాస్ హెయిర్ స్టైల్ విగ్ అని, అది ఒరిజిన‌ల్ కాద‌ని హేళ‌నగా కామెంట్‌లు పెడుతున్నారు. దీనిపై అంతే ఘాటుగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ రిప్లై ఇస్తుండ‌టంతో నెట్టింట ప్ర‌భాస్ లుక్ టాపిక్ హాట్ టాపిక్‌గా మారి వైర‌ల్ అవుతోంది.

ఇదిలా ఉంటే ప్ర‌భాస్ `ది రాజా సాబ్‌`, `ఫౌజీ`, `స్పిరిట్‌` సినిమాల త‌రువాత త‌మిళ ద‌ర్శ‌కుడు`అమ‌ర‌న్‌` ఫేమ్ రాజ్ కుమార్ పెరియ‌సామి డైరెక్ష‌న్‌లో ఓ భారీ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలిసింది. ఇప్ప‌టికే రాజ్‌కుమార్ పెరియ‌సామి స్టోరీలైన్‌ని ప్ర‌భాస్‌కు వినిపించాడ‌ని, ఆర్మీ నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంద‌ని, లైన్ ప్ర‌భాస్‌కు బాగా న‌చ్చింద‌ని, వెంట‌నే త‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.