Begin typing your search above and press return to search.

పూర్ ప్లానింగ్.. ఫ్యాన్స్ హర్ట్..!

ముఖ్యంగా బడా సినిమాలు చేస్తూ స్టార్ కాంబినేషన్స్ ని సెట్ చేస్తూ సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   12 May 2025 10:30 PM
పూర్ ప్లానింగ్.. ఫ్యాన్స్ హర్ట్..!
X

స్టార్ సినిమా అంటే ఆడియన్స్ లో ఉండే అంచనాలు తెలిసిందే. ముఖ్యంగా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న సినిమాల విషయంలో చాలా ఆసక్తిగా ఉంటారు. సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ వరకు ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఐతే కొన్ని ప్రొడక్షన్స్ స్టార్ సినిమాలను మొదలు పెట్టే ముందే ప్రమోషన్స్ కి సంబంధించిన విషయాలను కూడా ప్లాన్ చేస్తుంటారు. ఎందుకంటే స్టార్ ఫ్యాన్స్ సినిమా రిలీజ్ ఎప్పుడన్న దాని కన్నా ప్రాజెక్ట్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయా లేదా అన్నదే కాలిక్యులేట్ చేస్తారు. ఈ క్రమంలో కొన్ని నిర్మాణ సంస్థలు ఇలాంటివి ముందే ప్లాన్ చేస్తుంటే మరికొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం ఫెయిల్ అవుతున్నాయి.

ముఖ్యంగా బడా సినిమాలు చేస్తూ స్టార్ కాంబినేషన్స్ ని సెట్ చేస్తూ సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేస్తుంది. ఈ ప్రొడక్షన్ లో సినిమాలు మంచి కాంబినేషన్స్ లో సెట్ చేసుకున్నారు. కానీ వాటి అప్డేట్స్ ని మాత్రం గాలికి వదిలేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజా సాబ్ మొదలై దాదాపు రెండేళ్లు కావొస్తుంది. సినిమా నుంచి ఇప్పటివరకు ప్రభాస్ మోషన్ పోస్టర్ తప్ప మరో కంటెంట్ రాలేదు.

ఓ పక్క మారుతి ఎక్కడ కనిపించినా సరే రాజా సాబ్ అప్డేట్స్ అంటుంటే అతను కూడా ఏమి చెప్పలేకపోతున్నాడు. మరి డైరెక్టర్ కే ఈ ప్రాజెక్ట్ ఎక్కడిదాకా వచ్చింది అన్న క్లారిటీ లేకపోతే ఎలా అనుకుంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. రాజా సాబ్ అప్డేట్ అడిగితే వస్తుంది వస్తుంది అని ఊరించడమే తప్ప అసలు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి స్పందన లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది చర్చించాల్సిన విషయం.

ప్యాషనేట్ నిర్మాతగా టీ జీ విశ్వప్రసాద్ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. కానీ వాటిని సరైన టైం లో పూర్తి చేయకపోవడమే కాదు ఫ్యాన్స్ కి సరైన అప్డేట్స్ ఇవ్వడంలో కూడా విఫలమవుతున్నారు. మరి ఈ విషయంలో నిర్మాణ సంస్థ ఇక మీదట నుండైనా జాగ్రత్త వహిస్తే మంచిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజా సాబ్ మాత్రమే కాదు తేజా సజ్జాతో మిరాయ్ అంటూ మరో భారీ ప్రాజెక్ట్ కూడా చేస్తుంది. ఆ సినిమా గురించి కూడా అసలు ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు.