ఊహించిన దానికి 1% ఎక్కువే ఇస్తా
రాజా సాబ్ గ్లింప్స్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై అందరికీ అంచనాలు భారీగా పెరిగాయి.
By: Tupaki Desk | 8 Jun 2025 11:33 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా రాజా సాబ్. మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడని మొదట్లో తెలిసినప్పుడు అతని ఫ్యాన్స్ అసలొద్దు, మారుతితో సినిమా చేయొద్దని సోషల్ మీడియాలో తెగ వాపోయారు. కానీ తర్వాత్తర్వాత మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ కు నమ్మకం ఏర్పడింది. ఎప్పుడైతే మారుతి, ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూపించాడో అప్పట్నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ కు మారుతిపై కాన్ఫిడెన్స్ వచ్చింది.
రాజా సాబ్ గ్లింప్స్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై అందరికీ అంచనాలు భారీగా పెరిగాయి. ఆ గ్లింప్స్ చూశా రాజా సాబ్ లో వింటేజ్ ప్రభాస్ ను చూడబోతున్నామని డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయ్యారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజవాల్సింది కానీ ఇంకా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ బ్యాలెన్స్ ఉండటంతో రాజా సాబ్ షూటింగ్ వాయిదా పడింది.
అయితే మారుతి ప్రస్తుతం తన స్థాయికి మించిన భారాన్ని మోస్తున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకుని మరీ రాజా సాబ్ ను పూర్తి చేస్తున్నాడు. రాజా సాబ్ సినిమా గురించి మారుతిని ఎప్పుడు అడిగినా, ఈ సినిమా గురించి తానేమీ మాట్లాడనని, తన పనే మాట్లాడుతుందని చెప్తూ వస్తున్నాడు. కానీ రీసెంట్ గా రాజా సాబ్ సినిమా గురించి మారుతి మాట్లాడాడు.
డార్లింగ్ ఫ్యాన్స్ తన నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అంతకు మించే ఉంటుందని, ఆడియన్స్ ఆశించిన దానికి వన్ పర్సెంట్ ఎక్కువే ఇస్తామని అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పాడు. ఫ్యాన్స్ ఆయనపై చూపించిన ప్రేమను తాను చూశానని, ఆయనపై తనకున్న ప్రేమను ఫ్యాన్స్ ఈ సినిమాలో చూస్తారని, ఈ నెల 16న టీజర్ ను లాంచ్ చేస్తున్నామని మారుతి క్లారిటీ ఇచ్చాడు.
మారుతి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెడుతున్నాయి. రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో మారుతి తన మాటని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.
