రాజా సాబ్ లో డామినేషన్ ఎవరిది..?
రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో వస్తుంది.
By: Tupaki Desk | 6 May 2025 2:00 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో వస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఐతే ఈ ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరు మెయిన్ అన్నది తెలియాల్సి ఉంది. ముందు అసలు ఈ ప్రాజెక్ట్ లో మాళవిక ఒక్కతే నటిస్తుందని అనుకున్నారు కానీ ఆ తర్వాత నిధి అగర్వాల్ కూడా వచ్చింది.
నిధి అగర్వాల్ కూడా చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది. ఓ పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న నిధి రాజా సాబ్ లో కూడా నటిస్తుంది. ఐతే రాజా సాబ్ సినిమా లో మాళవిక కూడా అదరగొట్టనుందని తెలుస్తుంది. ఈ సినిమాతో అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. మాళవిక గ్లామర్ కి ఈ పాటికే స్టార్ రేంజ్ కి వెళ్లాలి కానీ అమ్మడికి లక్ కలిసి రావట్లేదు.
రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఇద్దరు నటిస్తున్నారు. ఐతే ఈ ఇద్దరిలో ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిధి, మాళవిక ఇద్దరు మంచి హీరోయిన్సే.. ఐతే సినిమాలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రాజా సాబ్ లో ఇద్దరిలో ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారన్నది చూడాలి. ఇక సినిమా ప్రమోషన్స్ విషయానికి వస్తే త్వరలో టీజర్ ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
రాజా సాబ్ సినిమా విషయంలో మారుతి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మర్ ఈ సినిమా విషయంలో రెబల్ ఫ్యాన్స్ లెక్కలు నిజం అవుతాయా లేదా అన్నది చూడాలి. అసలైతే ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన రాజా సాబ్ వాయిదా పడుతూ వస్తుంది. సినిమాను దసరా బరిలో దించే ప్లానింగ్ లో ఉన్నారని టాక్. ఐతే అఫీషియల్ గా మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. రాజా సాబ్ అవుట్ పుట్ గురించి ప్రభాస్ కూడా సాటిస్ఫైడ్ గా ఉన్నాడని టాక్. ఇండియన్ స్క్రీన్ మీద రాజా సాబ్ ఒక కొత్త ప్రయోగం అని అంటున్నారు. మరి అది ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తుంది అన్నది చూడాలి.
