కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. థియేటర్స్ లో రచ్చ రచ్చ!
దీంతో వెంటనే కన్నప్ప.. పెళ్లి చేసుకుంటే తెలిసేది అంటూ డైలాగ్ చెబుతారు. దీంతో ఒక్కసారిగా థియేటర్స్ లో చప్పట్లు, విజిల్స్ పడుతున్నాయి.
By: Tupaki Desk | 28 Jun 2025 5:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం సినీ వర్గాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఓ ఇంటి వాడు అవ్వాలని ఎప్పటి నుంచో ఫ్యాన్స్, సినీ ప్రియులు కోరుకుంటున్నారు. గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటికీ సూపర్ కాల్ గా వ్యవహరిస్తున్నారు.
అయితే ఇప్పుడు కన్నప్ప మూవీలో కూడా ప్రభాస్ పెళ్లి టాపిక్ వచ్చింది. మంచు విష్ణు లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా.. శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ప్రభాస్ క్యామియో రోల్ పోషించారు. రుద్ర క్యారెక్టర్ లో సందడి చేశారు డార్లింగ్.
తన యాక్టింగ్ అండ్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. విష్ణు- ప్రభాస్ మధ్య సీన్స్ అయితే సూపర్ అనే చెప్పాలి. అదే సమయంలో కన్నప్ప, రుద్ర క్యారెక్టర్స్ మధ్య పెళ్లి టాపిక్ వస్తుంది. ఓ సీన్‌లో కన్నప్ప (విష్ణు).. రుద్ర (ప్రభాస్)ను నీకు పెళ్లయిందా? అని అడుగుతారు. అప్పుడు రుద్ర.. నా పెళ్లి గురించి నీకెందుకులే అంటూ కౌంటర్ ఇస్తారు.
దీంతో వెంటనే కన్నప్ప.. పెళ్లి చేసుకుంటే తెలిసేది అంటూ డైలాగ్ చెబుతారు. దీంతో ఒక్కసారిగా థియేటర్స్ లో చప్పట్లు, విజిల్స్ పడుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. థియేటర్స్ దద్దరిల్లేలా గట్టిగా అరుస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రభాస్ బ్యాచిలర్ కదా అని ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. ఏదేమైనా కన్నప్పలోని ప్రభాస్ రోల్ తో ఆయన అభిమానులు ఫుల్ సాటిస్ఫై అవుతున్నారు. క్యారెక్టరైజేషన్ అదిరిపోయిందని చెబుతున్నారు. తమ ఫేవరెట్ హీరోతో సినిమాలో చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా కవర్ అయ్యాయని చెబుతున్నారు. మరి మీరు కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్ సీన్ ను చూశారా?
