కన్నప్ప.. ప్రభాస్ సైలెన్స్ కు రీజనేంటి? ముందే చెప్పేశాడా?
సినిమాలో యాక్ట్ మాత్రం చేస్తానని.. కానీ షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల ప్రమోషన్స్ కు రాలేనని చెప్పారని ఇప్పుడు తెలుస్తోంది.
By: Tupaki Desk | 25 Jun 2025 11:51 PM ISTటాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మరో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మహా శివుని పరమ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఆ సినిమాలో విష్ణు లీడ్ రోల్ పోషించారు. అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్యామియో రోల్ రుద్రగా కనిపించనున్నారు.
ప్రభాస్ రోల్ కు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ అన్నీ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఆయన చేసింది క్యామియో రోల్ అయినా ఇంపాక్ట్ మాత్రం వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. అందుకు సాక్ష్యం.. ఓ థియేటర్ ముందు ఏర్పాటు చేసిన ప్రభాస్ కటౌట్. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే సినిమాలోని తమ ఫేవరెట్ హీరో ప్రెజెన్స్ కోసం ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు.
అదే సమయంలో ప్రమోషన్స్ లో ప్రభాస్ సందడి లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పబ్లిసిటీలో ఎక్కడా నేరుగా కనపడలేదు. దీంతో అసంతృప్తికి గురయ్యారు. ప్రభాస్.. కన్పప్ప మూవీ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారోనని మాట్లాడుకుంటున్నారు.
అయితే ప్రభాస్ మాత్రం ముందే ప్రమోషన్స్ లో పాల్గొనని మేకర్స్ కు చెప్పేశారట. సినిమాలో యాక్ట్ మాత్రం చేస్తానని.. కానీ షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల ప్రమోషన్స్ కు రాలేనని చెప్పారని ఇప్పుడు తెలుస్తోంది. అయితే ప్రభాస్ నటిస్తా అన్నారు.. కాబట్టి అది చాలు అని.. పబ్లిసిటీ ఈవెంట్ కు రాకపోయినా పర్లేదని మేకర్స్ చెప్పారని సమాచారం.
ప్రస్తుతం హను రాఘవపూడి సినిమా షూటింగ్ తో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ పై ఇప్పుడు కీలక సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా ఫారిన్ నుంచి వచ్చిన ప్రభాస్.. డేట్స్ ఇవ్వడంతో మేకర్స్ షూట్ కంప్లీట్ చేస్తున్నారట.
అయితే ప్రభాస్ మాత్రం కన్నప్పను ప్రమోట్ చేసుంటే వేరే లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన క్యామియో రోల్ పోషిస్తేనే ఇంత హైప్ ఏర్పడింది. అదే ప్రమోషనల్ ఈవెంట్ లో సందడి చేసి ఉంటే మాత్రం.. పరిస్థితి వేరేలా ఉండేది. ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉండేవి. ఏదేమైనా ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల ప్రమోషన్స్ లో పాల్గొనలేక పోయారు! మరి కన్నప్పలో డార్లింగ్ రోల్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
