స్పిరిట్ వెనక్కి..కల్కి 2 ముందుకా?
నాగీ-ప్రభాస్-సందీప్- ప్రశాంత్ నీల్ మధ్య చర్చలు జరిగాయట. 'స్పిరిట్' మొదలైతే గనుక తన సినిమాకే బాండ్ అయి పనిచేయాలని సందీప్ కండీషన్ పెట్టాడటు.
By: Tupaki Desk | 5 May 2025 1:30 PM'కల్కి 2'కి రంగం సిద్దమవుతుందా? నాగీ సర్వం సిద్దం చేస్తున్నాడా? అంటే అవుననే లీకులందు తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 'రాజాసాబ్', 'పౌజీ' షూటింగ్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ముందు మొదలైన 'రాజాసాబ్' ని పక్కనబెట్టి మరీ 'పౌజీ' పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలన్నది ప్లాన్.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రమిది. అయితే షెడ్యూల్ ప్రకారం 'పౌజీ' తర్వాత ప్రభాస్ 'స్పిరిట్' చిత్రాన్ని పట్టాలెక్కించాలి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా స్క్రిప్ట్ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని రెడీగా ఉన్నాడు. అయితే ఇప్పుడీ షెడ్యూల్ మారుతున్నట్లు సమాచారం. 'స్పిరిట్' కంటే ముందుగానే 'కల్కి 2' పూర్తి చేయాలని భావిస్తున్నాడుట. నాగ్ అశ్విన్ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం.
దీనికి సంబంధించి ప్రభాస్ కాల్షీట్లు కూడా సిద్దం చేసాడని అంటున్నారు. దీంతో నాగీ ఇతర నటీనటులకు సంబంధించి కాల్షీట్ల సిద్దం చేసే పనిలో ఉన్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. దీనికి సంబంధించి నాగీ-ప్రభాస్-సందీప్- ప్రశాంత్ నీల్ మధ్య చర్చలు జరిగాయట. 'స్పిరిట్' మొదలైతే గనుక తన సినిమాకే బాండ్ అయి పనిచేయాలని సందీప్ కండీషన్ పెట్టాడటు.
అలా కాకపోతే స్పిరిట్ కాన్సంట్రేషన్ దెబ్బ తింటుందని అందుకోసం తాను వెయిట్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు భేటీలో తెలిపారుట. ప్రశాంత్ నీల్ కూడా 'సలార్ 2'కి చాలా సమయం పడుతుందని అంతవరకూ వేరే సినిమాలు చేసుకోమని డార్లింగ్ కి సూచించారుట. దీంతో నాగీ ముందుకొచ్చి 'కల్కి 2'ని మొదలు పెడ తానని భేటీ తెలిపినట్లు సమాచారం. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో తెలియాలి.