మిస్టర్ పర్ఫెక్ట్ మళ్లీ కావాలంటే సాధ్యమేనా..?
ప్రభాస్ ఫ్యాన్స్‌కి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బుజ్జిగాడు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు మోస్ట్ ఫేవరేట్.
By: Tupaki Desk | 23 April 2025 4:00 PM ISTడార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి మీడియం రేంజ్ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ స్టార్‌డం, క్రేజ్ ప్రస్తుతం మరో లెవల్ అనడంలో సందేహం లేదు. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మినిమం వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయగల సత్తా ఉన్న ప్రాజెక్ట్‌లు అనడంలో సందేహం లేదు. ప్రభాస్‌తో సినిమా చేయాలంటే దర్శకులకు లక్ ఉండాలి, ప్రభాస్ సినిమాలో హీరోయిన్స్ గా నటించాలంటే మినిమం స్టార్ హీరోయిన్ అయ్యి ఉండాలి. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా మరో మూడు నాలుగు సినిమాలు సైతం చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సమయంలో ఆయన పాత క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.
ప్రభాస్ ఫ్యాన్స్‌కి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బుజ్జిగాడు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు మోస్ట్ ఫేవరేట్. ఆ సినిమాలను ఎన్ని సార్లు రీ రిలీజ్ చేసినా చూస్తాం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అంతే కాకుండా ప్రభాస్, కాజల్ అగర్వాల్ కలిసి ఎన్ని సినిమాల్లో నటించినా చూసేందుకు సిద్ధం అంటూ అభిమానులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్ కాంబోలో ఇప్పటి వరకు మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ సమయంలో కాజల్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడనే పుకార్లు సైతం షికార్లు చేశాయి. దాంతో ఇద్దరి కాంబోకి మరింత క్రేజ్ పెరిగింది.
ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరో, మరో వైపు కాజల్ పెళ్లి చేసుకుని, తల్లి అయ్యి కెరీర్‌లో అలా అలా ముందుకు సాగుతుంది. సినిమాలు చేయాలని ఆమె అనుకుంటున్నా ఆమెకు పెద్దగా ఆఫర్లు మాత్రం దక్కడం లేదు. వచ్చిన చిన్నా చితక సినిమా ఆఫర్ల కారణంగా ఆమెకు పెద్దగా ప్రయోజనం దక్కడం లేదు. అయినా కూడా ఆమె ఇండస్ట్రీని వదిలి వెళ్లడం లేదు. ఈ సమయంలో ప్రభాస్ తన ప్రస్తుత సినిమాల్లో ఏదో ఒక సినిమాలో కాజల్‌తో కలిసి నటిస్తే చూడాలని ఉందని కొందరు నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్, కాజల్ అగర్వాల్ అభిమానులు మళ్లీ మిస్టర్ పర్ఫెక్ట్ కాంబో కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా వందలు కోట్లు దాటి వేల కోట్ల మార్కెట్‌కి చేరింది. అలాంటి సినిమాలకు ప్రతి విషయంలోనూ లెక్కలు వేస్తారు. ప్రభాస్‌తో సినిమా అంటే హీరోయిన్ విషయంలో కచ్చితంగా చాలా అంచనాలు, ఆలోచనలు ఉంటాయి. కనుక ప్రభాస్ చేయబోతున్న సినిమాల్లో ఎప్పటికీ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉండక పోవచ్చు అంటున్నారు. ఒకవేళ ప్రభాస్ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్టు కు ఛాన్స్ ఉంటే అప్పుడు కాజల్‌ను సంప్రదిస్తారేమో, అందుకు కాజల్ ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. మొత్తానికి అయితే వీరి కాంబోను మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ సినిమాలను మళ్లీ మళ్లీ చూసి అందులో చూసుకోవడమే తప్ప కొత్తగా రావడం సాధ్యం కాకపోవచ్చు.
