కన్నప్ప ఈవెంట్.. ప్రభాస్ ఎక్కడ..?
మంచు విష్ణు కన్నప్ప సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను చాలా పర్సనల్ గా తీసుకున్న మంచు విష్ణు పెట్టాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టేశాడు
By: Tupaki Desk | 21 Jun 2025 9:00 PM ISTమంచు విష్ణు కన్నప్ప సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను చాలా పర్సనల్ గా తీసుకున్న మంచు విష్ణు పెట్టాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టేశాడు. కన్నప్ప సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా మోహన్ బాబు, మంచు విష్ణు బడ్జెట్ లిమిటేషన్స్ లేకుండా భారీగా డబ్బు ఖర్చు చేశారు. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలన్న విష్ణు మంచు కసి కనబడుతుంది. కన్నప్ప సినిమాకు బజ్ రావడానికి ముఖ్య కారణం అందులోని స్టార్ కాస్ట్.
మంచు విష్ణు ఈ సినిమాలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్స్ ని రంగంలోకి దించాడు. వారి పాత్రల నిడివి.. వాటి ఉపయోగం ఎలాంటిది అన్నది తెలియదు కానీ కన్నప్ప సినిమాకు రావాల్సిన హంగామా అంతా ప్రభాస్ ఇంకా మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ల వల్ల వచ్చింది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ రుద్ర పాత్రలో చేస్తున్నాడని తెలిసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ హడావిడి మొదలైంది.
ఐతే ఈ నెల 27న రిలీజ్ అవుతున్న కన్నప్ప సినిమా వారం క్రితమే గుంటూరులో ఒక ఈవెంట్ జరపగా లేటెస్ట్ గా నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేశారు. మంచు ఫ్యాన్స్ తో పాటు కన్నప్ప స్టార్ కాస్ట్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ ఈవెంట్ కి వచ్చారు. కన్నప్ప నేడు జౌగబోయే ఈవెంట్ కి ప్రభాస్ వస్తున్నాడని వార్త రావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా కన్నప్ప ఈవెంట్ కి వచ్చారు. ఐతే ప్రభాస్ వస్తున్నాడా రాడా అన్నది క్లారిటీ లేదు. బయట సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ కోసం ఒకటే హడావిడి మొదలైంది.
ఇంతకీ కన్నప్ప ఈవెంట్ కి ప్రభాస్ వస్తాడా లేడా అన్నది చూడాలి. ఒకవేళ సినిమా రిలీజ్ ముందు జరిగే చివరి ఈవెంట్ కాబట్టి ప్రభాస్ రాకపోతే మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుందని చెప్పొచ్చు. కన్నప్ప ఈవెంట్ కి ప్రభాస్ వస్తే మాత్రం సినిమాకు కావాల్సినంత హై వస్తుంది. పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ కన్నప్ప టీం కు సపోర్ట్ గా ఉండేందుకు సినిమాలో రుద్ర పాత్ర చేశాడు. ఈవెంట్ కి కూడా ప్రభాస్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు.
