Begin typing your search above and press return to search.

ప్రభాస్- హోంబలే డీల్.. ఆ ఇద్దరు డైరెక్టర్స్ ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మధ్య ఇటీవల కుదిరిన భారీ డీల్.. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  M Prashanth   |   15 March 2026 5:00 AM IST
ప్రభాస్- హోంబలే డీల్.. ఆ ఇద్దరు డైరెక్టర్స్ ఎవరు?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మధ్య ఇటీవల కుదిరిన భారీ డీల్.. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్‌ లో వచ్చిన సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్ భారీ విజయాన్ని సాధించింది. ఆ సక్సెస్ తో ప్రభాస్- హోంబలే ఫిల్మ్స్ కాంబోపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాదు ఆ మూడు సినిమాల డీల్ అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే ఆ డీల్ లో భాగంగా ఇప్పటికే ఒక సినిమా ఫిక్స్ అయింది. అదే సలార్: పార్ట్ 2 శౌర్యంగ పర్వం. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. యాక్షన్ ఎలిమెంట్స్, స్టోరీ, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎలివేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, సలార్ 2 త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆ సినిమాను హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మించనుంది. అయితే ప్రభాస్ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మిగిలిన రెండు సినిమాలు ఏమిటన్నది ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఆ మూవీలు.. ప్రభాస్ ఏ డైరెక్టర్స్ తో చేయనున్నారోనని ఇప్పటికీ క్వశ్చన్ మార్క్.

అయితే ఆ రెండు ప్రాజెక్టులు ఇద్దరు యువ దర్శకులతో ఉండొచ్చనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుల్లో ఒకరు మలయాళ డైరెక్టర్ దింజిత్ అయ్యథాన్ అని టాక్ వినిపిస్తోంది. ఆయన కిష్కింధ కాండ, ఏకో సినిమాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవల దింజిత్ ప్రభాస్‌ ను కలిసి కథ వినిపించినట్లు తెలుస్తోంది. డార్లింగ్ ఇమేజ్ కు తగ్గట్లు దింజిత్ ఆ స్టోరీ రాసుకున్నారని టాక్.

అదే సమయంలో మరో దర్శకుడు కూడా డార్లింగ్ కు ఇటీవల ఓ కథ వినిపించినట్లు సమాచారం. కోలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి ఇటీవల ప్రభాస్ ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన అమరన్ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన కథపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఆ రెండు కథలు విన్న ప్రభాస్.. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి మధ్య హోంబలే ఫిల్మ్స్‌ తో ఉన్న మూడు చిత్రాల ఒప్పందం స్పెషల్ ఇంపార్టెన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా సలార్ 2 ఇప్పటికే ఖరారవ్వడంతో మిగిలిన రెండు సినిమాలు ఏవో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. దింజిత్ అయ్యథాన్, రాజ్‌ కుమార్ పెరియస్వామి చెప్పిన కథలలో ఏది ఫైనల్ అవుతుందో లేదా మరో కొత్త దర్శకుడితో సినిమా ప్రకటిస్తారా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఆ ప్రాజెక్టులపై చర్చ కొనసాగుతూనే ఉంటుంది.