తెలివిగా మార్కెట్ ను పెంచుకుంటున్న ప్రభాస్ హీరోయిన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. ఈ సినిమాలో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వీ ఇస్మాయెల్ ను హీరోయిన్ గా ఎంపిక చేయడం సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 10 Feb 2026 12:37 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. ఈ సినిమాలో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వీ ఇస్మాయెల్ ను హీరోయిన్ గా ఎంపిక చేయడం సంచలనంగా మారింది. ఇమాన్వీ ఇన్‌స్టా, యూట్యూబ్ లో డ్యాన్స్ వీడియోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకోగా, హను ఆమె పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయి ఆమెను ఫౌజీలో హీరోయిన్ గా ఎంపిక చేశారు.
మళ్లీ డ్యాన్స్ పై ఫోకస్ చేసిన ఇమాన్వీ
ఫౌజీ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత బిజీ అయిపోయిన ఇమాన్వీ రీల్స్ కు కాస్త దూరంగానే ఉన్నారు. ఇప్పుడు షూటింగ్ పూర్తవడంతో ఆమె మళ్లీ తన పాత ప్యాషన్ అయిన డ్యాన్స్ వైపు ఫోకస్ చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది. యూట్యూబ్, ఇన్‌స్టాలో ఇమాన్వీ అప్‌లోడ్ చేస్తున్న డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతూ, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య కూడా చర్చకు దారి తీస్తున్నాయి.
ధురంధర్ టైటిల్ సాంగ్ రీల్ కు విపరీతమైన రెస్పాన్స్
ఫ్యాన్స్ కూడా ఇమాన్వీ వీడియోలు చూసి ఆమెలో టాలెంట్ ఉందని, స్క్రీన్ పై పెర్ఫార్మ్ చేసే కెపాసిటీ కనిపిస్తోందని, ప్రభాస్ పక్కన ఆమె ఎనర్జీ మ్యాచ్ అవుతుందని చెప్తూ ఆ రీల్స్ కు కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రీసెంట్ గా ఇమాన్వీ, ధురంధర్ టైటిల్ సాంగ్ కు చేసిన రీల్ తో పాటూ ఓ సెమీ క్లాసికల్ డ్యాన్స్ వీడియోలు ఆమె ఫాలోయింగ్ ను మరింత పెంచాయని చెప్పొచ్చు.
ఫౌజీకి ఫ్రీ పబ్లిసిటీ
ఫౌజీ సినిమా రిలీజ్ కు ముందే ఆమెకు ఇంత హైప్ రావడం ఫ్యాన్స్ ను మరింత ఎగ్జైట్ చేస్తోంది. అంతేకాదు, మార్కెట్ పరంగా కూడా ఇమాన్వీ చేస్తున్న ఈ డ్యాన్స్ కంటెంట్ ఫౌజీకి ఫ్రీ పబ్లిసిటీ లాగా మారింది. ఇప్పటికే యూత్ ఆడియన్స్ లో ఇమాన్వీకి మంచి గుర్తింపు ఏర్పడుతుండటం వల్ల, సినిమా రిలీజ్ నాటికి ఈ ప్రమోషన్ మరింత ఈజీ అవుతుందన ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఫౌజీతో విపరీతంగా పెరగనున్న క్రేజ్
దాంతో పాటూ ఇమాన్వీకి నార్త్, సౌత్ రెండింటికీ కనెక్ట్ అయ్యే ఫేస్ వాల్యూ ఉండటంతో ఆమెకు తర్వాత్తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో కూడా అవకాశాలొచ్చే వీలుంది. ఫౌజీ సినిమా హిట్ అయితే, మొదటి సినిమాతోనే ఆమె మార్కెట్ భారీగా పెరిగే ఛాన్సుంటుందనేది అందరి మాట. ఆల్రెడీ ఫౌజీ రిలీజవకముందే ఇమాన్వీ ఓ క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ అందుకుందని వార్తలొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయి, తన డ్యాన్స్ వీడియోలతో ఫ్యాన్స్ ను హుక్ చేస్తూనే, మార్కెట్ లో తన స్థానాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఇమాన్వీ.
