Begin typing your search above and press return to search.

అతనితో ప్రభాస్ ఛాన్స్ లేదా..?

అందుకే ముందు ఆల్రెడీ కమిటైన సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాతే ప్రభాస్ కొత్త సినిమాను కానీ కొత్త కాంబినేషన్ ని కానీ ఓకే చేస్తారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   22 July 2025 8:30 AM IST
అతనితో ప్రభాస్ ఛాన్స్ లేదా..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ తర్వాత ఫౌజీ చేస్తున్నాడు. ఫౌజీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ చేసేలా షెడ్యూల్ చేస్తున్నారు. ఇక స్పిరిట్ కూడా సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. ఐతే స్పిరిట్ తో పాటు కల్కి 2 సినిమా కూడా త్వరగానే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐతే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ప్రభాస్ సినిమా ఒకటి ఉంటుందని ఈమధ్య వార్తలు వచ్చాయి.

ప్రశాంత్ నీల్ జై హనుమాన్ పూర్తి చేసి మరో రెండు సినిమాలను కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాతే ప్రభాస్ సినిమా చేసే అవకాశం ఉంది. ఐతే ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ ఇప్పుడప్పుడే సినిమా చేసే ఇంట్రెస్ట్ లో లేడని టాక్. ఎందుకంటే ఇంకా కమిటైన సినిమాలు చేయాల్సి ఉంది. ఇప్పుడు కొత్త సినిమా సైన్ చేసి మళ్లీ దాన్ని రెండేళ్ల తర్వాత స్టార్ట్ చేస్తే అది రిలీజ్ అయ్యే సరికి మరో రెండేళ్లు అంటే నాలుగు ఐదేళ్లు పడుతుంది.

అందుకే ముందు ఆల్రెడీ కమిటైన సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాతే ప్రభాస్ కొత్త సినిమాను కానీ కొత్త కాంబినేషన్ ని కానీ ఓకే చేస్తారని తెలుస్తుంది. ప్రభాస్ రాజా సాబ్ తో మొదలు పెడితే ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 చివరగా సలార్ 2 లు పూర్తి చేయాలి. ఈ సినిమాలన్నీ కూడా రానున్న రెండేళ్లలో ప్రభాస్ పూర్తి చేసేలా షెడ్యూల్ వేసుకున్నాడు.

దాని ప్రకారంగానే ప్రభాస్ వెళ్తే మాత్రం బాగుంటుంది. ఎలాగు ప్రభాస్ ఆ సినిమాలు పూర్తి చేసే దాకా మరో సినిమా చేసే ఛాన్స్ లేదు. ఐతే డైరెక్టర్స్ ఆ సినిమాల అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి అందిస్తుంటే వాళ్లకి కూడా అంత ఇబ్బంది ఉండదు. ప్రభాస్ ఇక మీదట వన్ ఇయర్ లో రెండు సినిమాలు రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి ఫౌజీ, స్పిరిట్ 2026 రిలీజ్ ఉండే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడాలి.

సో ప్రభాస్ మరో న్యూ డైరెక్టర్ లేదా కొత్త కాంబినేషన్ సెట్ చేయాలంటే ఎలా లేదన్నా 3 ఏళ్ల దాకా టైం తీసుకోవాల్సిందే. ఐతే హోంబలె ప్రొడక్షన్స్ వారు ప్రభాస్ తో 3 సినిమాల అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో సలార్ 2 తో పాటు మరో రెండు సినిమాలు ఉంటాయని తెలుస్తుంది.