Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ను విష్ణు అలా కూడా వాడేస్తాడా..!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప' జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచు విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమాను రూపొందించారు.

By:  Tupaki Desk   |   3 Jun 2025 9:00 PM IST
ప్రభాస్‌ను విష్ణు అలా కూడా వాడేస్తాడా..!
X

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప' జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచు విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను స్వయంగా మంచు విష్ణు నిర్మించడంతో పాటు రచన సహకారం అందించాడు. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా మంచు విష్ణు ఈ సినిమాను చెబుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటించగా మోహన్ బాబు, ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెల్సిందే. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచేందుకు సిద్ధం అయ్యారు.

మొదటి నుంచి కూడా కన్నప్ప సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి ఆసక్తి నెలకొన్న విషయం తెల్సిందే. కన్నప్ప సినిమా బాక్సాఫీస్‌ వద్ద కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ ఈ సినిమాలో నటించిన కారణంగా అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ప్రభాస్ పాత్ర గురించి మంచు విష్ణు పదే పదే చెప్పడంతో ఆసక్తి మరింతగా పెరిగింది. ప్రభాస్‌ పాత్ర చిన్నది కాదని, చాలా పెద్దగా ఉంటుంది అని, తప్పకుండా అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని, ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చే విధంగా ఉంటుంది అనే విశ్వాసంను మంచు విష్ణు వ్యక్తం చేస్తున్నాడు.

కన్నప్ప సినిమాలో మంచు విష్ణు నటించడమే చాలా పెద్ద ప్రమోషన్‌. అలాంటిది ప్రభాస్‌ను కన్నప్ప సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు తీసుకు రావాలని మంచు విష్ణు భావిస్తున్నాడు. సినిమాలో నటించిన వారు అంతా కూడా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనే విధంగా మంచు విష్ణు ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకోసం అక్షయ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌ ఓకే చెప్పారని తెలుస్తోంది. ప్రభాస్‌ను సైతం వీలు చూసుకుని రావాలంటూ మంచు విష్ణు విజ్ఞప్తి చేస్తున్నాడట. ప్రభాస్‌కి అనువైన తేదీనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విష్ణు నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ప్రభాస్ ను ఈవెంట్‌కి తీసుకు వచ్చేందుకు గాను సాధ్యం అయినంత వరకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

కన్నప్ప ట్రైలర్‌ లాంచన్‌ను ఇండోర్‌లో ప్లాన్‌ చేశాడు. అక్కడ బాలీవుడ్‌ స్టార్స్‌ సందడి చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి షిప్ట్‌ కాబోతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్‌ 17న హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభాస్‌కి అనుకూలంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఉండాలని భావిస్తున్నారు. అందుకే ప్రభాస్ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన తర్వాత వేదికను అధికారికంగా నిర్ణయిస్తారని తెలుస్తోంది. సినిమాలో నటింపజేయడం మాత్రమే కాకుండా ప్రమోషన్‌కి కూడా ప్రభాస్‌ను వాడటం అంటే మంచు విష్ణు మామూలోడు కాదు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ప్రభాస్‌ కనుక కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు అయితే సినిమా స్థాయి పెరగడం ఖాయం.