Begin typing your search above and press return to search.

ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ ఆర్థిక సాయంలో వాస్తవం!

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంక‌ట్ తీవ్ర అనారోగ్యంతో ఐసియు- వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్నాడ‌ని క‌థ‌నాలొచ్చాయి.

By:  Tupaki Desk   |   5 July 2025 9:49 AM IST
ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ ఆర్థిక సాయంలో వాస్తవం!
X

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంక‌ట్ తీవ్ర అనారోగ్యంతో ఐసియు- వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్నాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. అత‌డి కుమార్తె, కుటుంబ స‌భ్యులు ఇంత‌కుముందు స‌హాయం కోసం అర్థించారు. ఫిష్ వెంక‌ట్ కి కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌ల‌కు చికిత్స జ‌రుగుతోంద‌ని అయితే దీనికి 50ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌వుతుంద‌ని వైద్యులు సూచించిన‌ట్టు వెల్ల‌డించారు. అంతేకాదు కిడ్నీని వేరొక ధాత నుంచి సేక‌రించాల్సి ఉంది. అయితే కుటుంబ స‌భ్యులు ఎంత‌గా అభ్య‌ర్థించినా సినీప‌రిశ్ర‌మ నుంచి ఆర్థిక సాయానికి ఎవ‌రూ స్పందించ‌లేద‌ని కూడా వారు ఆందోళ‌న చెందిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి.

అయితే ఈ ప్ర‌చారం ఇలా ఉండ‌గానే మ‌రో కొత్త ప్ర‌చారం ఇండ‌స్ట్రీలో హీట్ పుట్టించింది. ఫిష్ వెంక‌ట్ కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ప్ర‌భాస్ 50ల‌క్ష‌లు సాయం చేసార‌ని స్థానిక మీడియాల‌తో పాటు, జాతీయ స్థాయిలో మీడియాల‌న్నీ అత్యుత్సాహంగా క‌వ‌ర్ చేసాయి. అయితే ఇప్ప‌టికే ప్ర‌భాస్ 50 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందించారా? అంటే ఇంకా ఏ సాయం అంద‌లేద‌ని తెలుస్తోంది. ఫిష్ వెంక‌ట్ కి ఆర్థిక సాయం అందిస్తామంటూ ప్ర‌భాస్ అసిస్టెంట్ నుంచి కాల్ వ‌చ్చింద‌ని, అయితే కిడ్నీ ధాత దొరికిన త‌ర్వాత‌ సంప్ర‌దించాల్సిందిగా వారు చెప్పిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి.

అయితే ఫిష్ వెంక‌ట్ కి సాయం చేసేందుకు `గ‌బ్బ‌ర్ సింగ్ గ్యాంగ్`(స‌హ‌న‌టులు) మాత్ర‌మే ముందుకు వ‌చ్చార‌ని, ప‌రిశ్ర‌మ నుంచి ఇత‌రులు ఎవ‌రూ ఎలాంటి సాయానికి ముందుకు రాలేద‌ని ఒక సెక్ష‌న్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఫిష్ వెంక‌ట్ కుటుంబానికి ప్రామిస్ చేసింది ప్ర‌భాస్ అసిస్టెంటేనా కాదా? అన్న‌దానిపైనా స్ప‌ష్ఠ‌త లేదు. ఈ వార్త‌ల్ని ప్ర‌భాస్ టీమ్ అధికారికంగా క‌న్ఫామ్ చేయ‌లేదు.