స్పిరిట్ లేట్.. గేర్ మార్చే ప్లాన్ లో డైరెక్టర్..?
వరుస సినిమాలు కమిట్ అవుతున్న ప్రభాస్ ఆ సినిమాల విషయంలో క్లారిటీ మిస్ అవుతున్నాడన్న మాట వినిపిస్తుంది.
By: Tupaki Desk | 20 May 2025 8:00 AM ISTవరుస సినిమాలు కమిట్ అవుతున్న ప్రభాస్ ఆ సినిమాల విషయంలో క్లారిటీ మిస్ అవుతున్నాడన్న మాట వినిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు లైన్ లో ఉన్న సినిమాలు ఐదారు ఉన్నాయి వాటిలో ఏది ఎంతవరకు వచ్చింది అన్న క్లారిటీ లేదు. మారుతితో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ అయితే ఎప్పటి నుంచో సెట్స్ మీద ఉంది కానీ ఆ సినిమాకు సంబందించిన ఏ అప్డేట్ కూడా బయటకు రావట్లేదు. అసలు రాజా సాబ్ విషయంలో ఏం జరుగుతుంది అన్నది కూడా అర్ధం కావట్లేదు.
ఆ సినిమాతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఐతే యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాతో ప్రభాస్ చేయాల్సిన సినిమా స్పిరిట్ ఈపాటికి మొదలవ్వాల్సి ఉంది కానీ ఇంకా దానికి ముహూర్తం రాలేదు. ప్రభాస్ ముందు రాజా సాబ్ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత నెక్స్ట్ సినిమాల షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఐతే సందీప్ వంగ స్పిరిట్ ని త్వరగా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు.
ఒకవేళ ప్రభాస్ స్పిరిట్ ని లేట్ చేస్తే సందీప్ మరో సినిమాను చేయాలని చూస్తున్నాడట. ఎందుకంటే ప్రభాస్ కోసం తన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకన్నట్టుగా భావిస్తున్నాడట. తన డైరెక్షన్ లో సినిమాను పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసే సందీప్ ప్రభాస్ ని ఒక ఏడాది తనకు టైం ఇవ్వాలని అడిగాడట. స్పిరిట్ కోసం ఏడాది షెడ్యూల్ ఇచ్చేలా ప్రభాస్ కూడా రెడీ అన్నాడట. కానీ రాజా సాబ్ ని పూర్తి చేసి ముందు అది రిలీజ్ చేయాలనే ప్లాన్ లో భాగంగా స్పిరిట్ ని ఇంకాస్త లేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఐతే అనుకున్న దానికన్నా మరో 3, 4 నెలలు లేట్ గా స్పిరిట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు. రాజా సాబ్ తర్వాత ఫాజీ రిలీజ్ ప్లానింగ్ ఉన్నా స్పిరిట్ విషయం లో కూడా సందీప్ దూకుడు గా ఉన్నాడని అర్ధమవుతుంది. రాజా సాబ్, ఫాజీ మాత్రమే కాదు స్పిరిట్ తో పాటు సలార్ 2, కల్కి 2 కూడా చేయాల్సి ఉంది. వీటితో పాటు ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో దిల్ రాజు సినిమా కూడా లైన్ లో ఉంది. మరి ఈ సినిమా లన్నీ ప్రభాస్ ఎప్పుడు పూర్తి చేస్తాడా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
