హనుకి ప్రభాస్ డెడ్ లైన్..నిజమెంత?
ఇండియన్ సూపర్ స్టార్లలో అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరో ప్రభాస్. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
By: Tupaki Desk | 15 Feb 2026 10:00 PM ISTఇండియన్ సూపర్ స్టార్లలో అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరో ప్రభాస్. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. స్టార్ హీరోలకు భిన్నంగా ఒకేసారి రెండు మూడు క్రేజీ సినిమాల్లో నటిస్తూ వరుస షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు. ఈ ఏడాది హారర్ కామెడీ థ్రిల్లర్ `రాజాసాబ్`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్ ఇదే ఏడాది మరో భారీ పాన్ ఇండియా మూవీతో ప్రంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న విషయం తెలిసిందే.
`సీతారామం`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న హను రాఘవపూడి డైరెక్షన్‌లో యుద్దం రాసిన ప్రేమకథగా `ఫౌజీ`ని రూపొందిస్తున్నాడు. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా కీలక పాత్రల్లో మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్, జయప్రద, భానుచందర్ తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి టీ సిరీస్ సంయుక్తంగా ఈ భారీ వార్ లవ్ డ్రామాని నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీతో పాటు ప్రభాస్ `స్పిరిట్`లో నటిస్తున్న విషయం తెలిసిందే.
క్రే.జీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఏ విషయంలోనూ రాజీపడకుండా బాడీ డబుల్‌ని కూడా వాడనివ్వకుండా చాలా స్ట్రిక్ట్‌గా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే కీలక ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లని రంగంలోకి దించేసిన సందీప్ ఈ మూవీ షూటింగ్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు త్వరలో `కల్కి 2898ఏడీ` సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో `ఫౌజీ` డైరెక్టర్‌తో పాటు టీమ్‌కి డెడ్ లైన్ విధించినట్టుగా తెలిసింది.
వరుస క్రేజీ ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రభాస్ అనుకున్న టైమ్‌కి సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలంటే షూటింగ్ మరింత ఫాస్ట్‌గా చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే `ఫౌజీ`ని దసరాకు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా ఆ సమయానికి రిలీజ్ చేయలేకపోతే తరువాత ప్రాజెక్ట్‌లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ప్రభాస్ `ఫౌజీ` టీమ్‌కు డెడ్ లైన్ విధించాడట. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాని పూర్తి చేసి దసరాకు రిలీజ్ చేయాలని చెప్పడంతో ఇప్పుడు టీమ్ రాత్రింబవళ్లు పని చేస్తున్నారట.
రెస్ట్ లేకుండా పని చేస్తేనే `ఫౌజీ` అనుకున్న అక్టోబర్‌కు రెడీ అవుతుందని, దాంతో ఇతర సినిమాలకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెబుతున్నారు. సందీప్ రూపొందిస్తున్న `స్పిరిట్` విషయంలో ప్రభాస్‌కు ఎలాంటి టెన్షన్ లేదు. కారణం ప్రభాస్ రెస్ట్ తీసుకుందామన్నా, బాడీ డబుల్‌తో లాగించేద్దామన్నా సందీప్ రెడ్డి వంగ వినే రకం కాదు. అనుకున్నది అనుకున్నట్టు చేయాల్సిందేనని పట్టుబట్టే రకం కాబట్టి `స్పిరిట్` సందీప్ చెప్పిన టైమ్‌కే వచ్చేస్తుందని ప్రభాస్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడట.
