Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ నుంచి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ రానుంది!

టాలీవుడ్ టాస్ స్టార్స్ ప‌లు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కూడా ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా సినిమాలలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 May 2026 10:00 PM IST
ప్ర‌భాస్ నుంచి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ రానుంది!
X

టాలీవుడ్ టాస్ స్టార్స్ ప‌లు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కూడా ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా సినిమాలలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామా `స్పిరిట్‌`తో పాటు `క‌ల్కి 2`లోనూ న‌టిస్తున్నారు. వీటితో పాటు హ‌ను రాఘ‌వ‌పూడి అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్న `ఫౌజీ`లోనూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూడు భారీ సినిమాల‌కు సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర వేగంగా జ‌రుగుతోంది.

ఈ మూడు భారీ పాన్ ఇండియా సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ పై ప్ర‌భాస్ దండ‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. ఈ మూడు సినిమాల్లో ముందుగా రొమాంటిక్ పీరియాడిక్ యాక్ష‌న్ వార్‌ డ్రామా `ఫౌజీ` ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. నేతాజీ సుభాస్ చంద్ర‌బోస్ ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ నేప‌థ్యంలో సాగే క‌థ‌గా చెబుతున్నారు. ఇప్ప‌టికే లీక్ అయిన స్టోరీ, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న స్టిల్స్ ఈ విష‌యాన్ని స్పష్టం చేస్తున్నాయి. అప్ప‌ట్లో నేతాజీ నేతృత్వంలో ప‌ని చేసిన ఓ ర‌హ‌స్య గూఢ‌చారిగా ప్ర‌భాస్ ఇందులో క‌నిపిస్తాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇమాన్వి క‌థానాయ‌క‌గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో మిథున్ చక్ర‌వ‌ర్తి, అనుప‌మ్ ఖేర్‌, జ‌య‌ప్ర‌ద‌, చైత్ర జే ఆచ‌ర్‌, భాను చంద‌ర్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ప్ర‌భాస్ సినిమాల్లో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న వార్ డ్రామా కావ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందుకు ప్ర‌ధాన కార‌ణం ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి రూపొందించిన `సీతారామం` కూడా ఓసైనికుడి ప్రేమ‌క‌థ చుట్టూ న‌డ‌వ‌డం, అది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో `ఫౌజీ` అంత‌కు మించిన స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకుంటుంద‌ని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఈ మూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు `ఫౌజీ`కి సంబంధించిన తాజాగా ఓ షాకింగ్ అప్ డేట్‌ని ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొన్ని రోజులుగా ఈ సినిమాకు సీక్వెల్ రానుందంటూ వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే స్పందించిన మేక‌ర్స్ షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు. ప్ర‌భాస్ పాన్ ఇండియా సినిమా అంటే సీక్వెల్ అనేది ఓ బ్రాండ్‌గా మారిపోయింది. అయితే `ఫౌజీ` విష‌యంలో అది జ‌ర‌గ‌డం లేద‌ని ప్రొడ్యూస‌ర్స్ క్లారిటీ ఇచ్చారు.

అయితే సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ఉంటుంద‌ని చెప్పి షాక్ ఇచ్చారు. క‌థ‌లో ఇంత వ‌ర‌కు అన్వేషించ‌ని ఓ కీల‌క‌మైన అంశం ఉంద‌ని, అది క‌థానాయ‌కుడి పాత్ర మూలాళ్లోకి వెళ్ల‌డానికి మార్గం సుగ‌మం చేస్తుందని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా ప్రీక్వెల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. ఇది ప‌ట్టాలెక్కితే ప్ర‌భాస్ కెరీర్‌లో రానున్న తొలి ప్రీక్వెల్ మూవీ అవుతుంది. `సీతారామం` త‌రువాత విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సారి ప్ర‌భాస్ సినిమాతో బిగ్ డైరెక్ట‌ర్స్ లీగ్‌లోకి ఎంట‌ర్ కావ‌డం ఖాయం అని తెలుస్తోంది.