ప్రభాస్ ఫౌజి షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్
రీసెంట్ గా హాలీడేస్ ను ముగించుకుని ప్రభాస్ హైదరాబాద్ కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 May 2025 11:15 AM ISTటాలీవుడ్ లోని స్టార్ హీరోల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసినంత వేగంగా ఎవరూ సినిమాలు చేయడం లేదని అంతా భావిస్తున్న టైమ్ లో ప్రభాస్ కు షూటింగ్ టైమ్ లో అయిన గాయం వల్ల డాక్టర్లు అతనికి విశ్రాంతిని సూచించారు. దీంతో ప్రభాస్ గత కొన్నాళ్లుగా హాలీడేస్ లోనే ఉన్నాడు. హాలీడేస్ నిమిత్తం తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఇటలీ వెళ్లి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు ప్రభాస్.
రీసెంట్ గా హాలీడేస్ ను ముగించుకుని ప్రభాస్ హైదరాబాద్ కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన ప్రభాస్ రేపట్నుంచి ఫౌజి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇన్నాళ్లూ ప్రభాస్ లేనందున ఆగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ తిరిగి హైదరాబాద్ కు రావడంతో రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవనున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ అనుమతితోనే ఫౌజీ నెక్ట్స్ షెడ్యూల్ ను మేకర్స్ రేపటి నుంచి ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్స్ ను కూడా వేశారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం పలువురు టాప్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు.
దీంతో పాటూ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటించిన ది రాజా సాబ్ టీజర్ కు కూడా డబ్బింగ్ చెప్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ రాజా సాబ్ టీజర్ అనౌన్స్మెంట్ ను ఇవ్వనున్నట్టు సమాచారం. రాజా సాబ్ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ ఇయర్ ఎండింగ్ కు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సెట్స్ లో జాయిన్ కానున్నాడు. ఏడు నెలల్లో స్పిరిట్ ను పూర్తి చేసి నెక్ట్స్ ఇయర్ లో సినిమాను రిలీజ్ చేయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజా సాబ్, ఫౌజీ సినిమాల రిలీజ్ డేట్స్ మాత్రం ఇంకా ఫిక్స్ అవలేదు.
