Begin typing your search above and press return to search.

టింబర్‌ డిపోలో ప్రభాస్‌ పోరాటం

సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి వర్కింగ్‌ టైటిల్‌గా ఫౌజీ కొనసాగుతూ వస్తుంది.

By:  Tupaki Desk   |   5 Jun 2025 9:30 AM
టింబర్‌ డిపోలో ప్రభాస్‌ పోరాటం
X

ప్రభాస్‌ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలను చేస్తున్నాడు. కానీ అభిమానుల టైం బాగా లేకపోవడంతో అవి ఏవో కారణాల వల్ల ఆలస్యం అవుతూ ఉన్నాయి. ప్రభాస్‌, మారుతి కాంబోలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా మొన్న ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉన్న విషయం తెల్సిందే. కానీ సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇటీవలే ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్రభాస్‌ రాజాసాబ్‌ సినిమాను పక్కన పెట్టి ఫౌజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని ప్రారంభించే సమయంలో అనుకున్నారు. కానీ అది కూడా సాధ్యం అయ్యేలా లేదు.

ప్రస్తుతం ప్రభాస్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఫౌజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన టింబర్‌ డిపో సెట్‌లో ప్రభాస్ భారీ యాక్షన్‌ సీన్స్‌లో నటిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీగా ఈ సినిమాను హను రాఘవపూడి రూపొందిస్తున్నాడు. ఆయన గత చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా సెన్స్‌బుల్‌గా ఉంటుందని, అంతే కాకుండా మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరీని కలిగి ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెప్పుకొచ్చారు. ఆకట్టుకునే కథ, కథనంతో దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్‌ దాదాపుగా సగం పూర్తి అయిందని తెలుస్తోంది.

సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి వర్కింగ్‌ టైటిల్‌గా ఫౌజీ కొనసాగుతూ వస్తుంది. అయితే ప్రధాన టైటిల్‌ మాత్రం ఇది కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హను రాఘవపూడి సినిమాలన్నింటికి విభిన్నమైన టైటిల్‌ను పెడుతూ ఉంటాడు. కనుక ఈ సినిమాకు సైతం అదే తరహాలో విభిన్నమైన టైటిల్‌ను షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఖరారు చేస్తాడేమో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఇమాన్వి నటిస్తోంది. ఆ మద్య ఈమెను కొందరు పాకిస్తానీ అంటూ విమర్శించడంతో సినిమా విషయమై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఇమాన్వికి పాకిస్తాన్‌కి ఎలాంటి సంబంధం లేదని ఆ తర్వాత తేలిపోయింది. ఇమాన్వి ఆ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసింది. హీరోయిన్‌గా ఇమాన్వి ఫౌజీ తో ఎంట్రీ ఇవ్వబోతుంది. మొదటి సినిమానే ప్రభాస్‌తో చేస్తున్న నేపథ్యంలో ఇమాన్వి రాబోయే రోజుల్లో ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో వెలుగు వెలగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అతి త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ కొన్ని కారణాల వల్ల ఆలస్య అవుతున్న కారణంగా ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని అనుకున్న ఈ సినిమాను కాస్త వచ్చే ఏడాది సమ్మర్‌కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీ విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.