ప్రభాస్ మూవీతో.. ప్రొడ్యూసర్ కూతురి డెబ్యూ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవవూడి కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 5:01 PMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవవూడి కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఓవైపు మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా సాబ్ తోపాటు హను మూవీని కూడా పూర్తి చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ప్రభాస్, హను రాఘవపూడి సినిమా రూపొందుతోంది. విభిన్నమైన స్టోరీ, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఫౌజీ అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఆ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఆ మూవీతోనే డెబ్యూ ఇవ్వనున్నారు అమ్మడు. అయితే సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కేరళలో ఇప్పటికే మేకర్స్ పూర్తి చేశారు. రీసెంట్ గా హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ లేని సీన్స్ ను ఇప్పుడు షూట్ చేస్తున్నారని సమాచారం. సెకండ్ షెడ్యూల్ లో సినిమాలో వచ్చే కీలకమైన చైల్డ్ హుడ్ ఎపిసోడ్స్ ను తెరకెక్కిస్తున్నట్లు టాక్.
అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఒక చిన్న రోల్ లో మూవీలో నిర్మాత రవిశంకర్ కుమార్తె లిషా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాతో డెబ్యూ ఇస్తుంది చిన్నారి. అయితే చిన్న పిల్ల అయినా నేచురల్ గా నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మూవీ యూనిట్ మొత్తం లీషా ను అభినందించిందట.
సినిమాలో లీషాది మెయిన్ రోల్ కాదని, కానీ స్పెషల్ గా ఉండేందుకు మేకర్స్ రంగంలోకి దించినట్లు సమాచారం. అదే సమయంలో విశాల్ చంద్రశేఖర్.. శరవేగంగా మ్యూజిక్ వర్క్ ను పూర్తి చేస్తున్నారట. ఇప్పటికే మూడు పాటలను రెడీ చేశారని టాక్. ఆయన వర్క్ పట్ల హను రాఘవపూడి సాటిస్ఫై అయ్యారట.
బ్రిటిష్ కాలం నాటి కథా నేపథ్యంతో సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ రెండు రోల్స్ లో నటిస్తున్నారని కూడా తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారని సమాచారం. మరి మేకర్స్ ఎప్పుడు అప్డేట్ ఇస్తారో వేచి చూడాలి.