Begin typing your search above and press return to search.

పంజాబ్ లో ప్ర‌భాస్ విధ్వంసం!

ప్ర‌భాస్ న‌టించిన మొద‌టి సినిమా నుంచి `క‌ల్కీ` రిలీజ్ వ‌ర‌కూ ఏ సినిమా పోస్ట‌ర్ వ‌ద‌ల‌కుండా అన్నింటిని ఓ ఆర్డ‌ర్ లో అతికించి పంజాబ్ అభిమానులు అభిమానం చాటుకున్నారు.

By:  Tupaki Desk   |   5 July 2025 6:28 PM IST
పంజాబ్ లో ప్ర‌భాస్ విధ్వంసం!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అన్ని భాష‌ల్లోనూ ఫాలోయింగ్ ఉన్న న‌టు డు . టాలీవుడ్ నుంచి ఎంత మంది పాన్ ఇండియా స్టార్లు పుట్టుకొచ్చినా? డార్లింగ్ క్రేజ్ మాత్రం ఎంతో స్పెషల్. ముఖ్యంగా బాలీవుడ్ లో ప్ర‌భాస్ క్రేజ్ అసాధార‌ణ‌మైంది. అత‌డి ఇమేజ్ ఏకంగా దేశాలే దాటి పోయింది. జ‌పాన్, చైనా లాంటి దేశాల్లో తానో పెద్ద స్టార్. అక్క‌డా ప్ర‌భాస్ అంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. తాజాగా పంజాబ్ లో డార్లింగ్ ఫాలోయింగ్ మ‌రోసారి బ‌య‌ట ప‌డింది.

పంజాబ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో హైవేని అనుకుని ఉన్న గోడంతా ప్ర‌భాస్ సినిమా పోస్ట‌ర్ల‌తో నిండి పోయింది. ప్ర‌భాస్ న‌టించిన మొద‌టి సినిమా నుంచి `క‌ల్కీ` రిలీజ్ వ‌ర‌కూ ఏ సినిమా పోస్ట‌ర్ వ‌ద‌ల‌కుండా అన్నింటిని ఓ ఆర్డ‌ర్ లో అతికించి పంజాబ్ అభిమానులు అభిమానం చాటుకున్నారు. ఆ పోస్ట‌ర్లన్నీ తెలు గులో ఉన్నాయి. ఎందుకంటే ప్ర‌భాస్ న‌టించిన చాలా సినిమాలు హిందీలో రిలీజ్ కానివే. బాహుబ‌లి నుంచే అక్క‌డ ప్యాన్స్ ఏర్ప‌డ్డారు. ప్ర‌భాస్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ పంజాబ్ అంటూ పోస్ట‌ర్ల‌పై వేసుకున్నారు.

దీంతో టాలీవుడ్ షాక్ అయింది. పంజాబ్ లో కూడా ఈ రేంజ్ లో అభిమానులున్నారా? అంటూ స‌ర్ ప్రైజ్ అవుతున్నారు. అక్క‌డ కూడా ప్యాన్స్ అసోసియేష‌న్ లే ఏర్ప‌డ్డాయా? అని స‌ర్ ప్రైజ్ అవ్వాల్సిన స‌న్నివేశం. బాలీవుడ్ హీరోల‌కే ఈ రేంజ్ లో అక్క‌డ ప్యాన్స్ అసోసియేష‌న్లు లేవు. ఆ క్రేజ్ డార్లింగ్ కి మాత్రేమే సాధ్య‌మైంది. దీనికంటే ముందు న‌ట‌సింహ బాల‌కృష్ణ క్రేజ్ కూడా కుంభ‌మేళాలో బ‌య‌ట ప‌డింది.

నార్త్ బ‌స్సుల‌కు బాల‌య్య `అఖండ` పోస్ట‌ర్లు అంటించి హిందీ అభిమానులంతా బాల‌య్య‌పై అభిమానం చూపించారు. అప్పుడే అర్ద‌మైంది బాల‌య్య కి కూడా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంద‌ని. ఇలాంటి ఘ‌న‌త ఏ హీరోకి కూడా ఇంత వ‌ర‌కూ అక్క‌డ ద‌క్క‌లేదు. అందుకే బాల‌య్య‌, ప్ర‌భాస్ ఉత్తారాది రాష్ట్రాల్లో ఓ స్పెష‌ల్. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ `పౌజీ`, `ది రాజాసాబ్` చిత్రాల్లో...బాల‌య్య ` అఖండ 2` షూటింగ్ ల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.