సర్‌ప్రైజ్.. బిజీ షెడ్యూల్ మధ్య ఆ థియేటర్ కు ప్రభాస్!
తాజాగా ప్రభాస్ హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టిప్లెక్స్‌లో కనిపించారు. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా థియేటర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
By: Tupaki Desk | 15 July 2025 11:58 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాజా సాబ్, హను రాఘవపూడితో మూవీ, సలార్ 2, స్పిరిట్, కల్కి పార్ట్ 2 ఇలా లైన్‌లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు షూటింగ్స్.. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులతో డార్లింగ్ చాలా టైట్ షెడ్యూల్‌లోనే ముందుకు వెళ్తున్నారు. అలాంటిది తన శైలి కంటే డిఫరెంట్‌గా పబ్లిక్‌లో కనిపించడం చాలా అరుదైన విషయం.
తాజాగా ప్రభాస్ హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టిప్లెక్స్‌లో కనిపించారు. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా థియేటర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్షకుల మధ్య కూర్చుని హాలీవుడ్ యాక్షన్ డ్రామా ‘ఎఫ్1’ సినిమా వీక్షించారు. ఇది చూసిన కొంతమంది స్టాఫ్‌తో ఫోటోలు దిగారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ప్రభాస్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అక్కడే కనిపించడం అభిమానుల్లో కొత్త ఊహాగానాలకు దారితీసింది. ఇద్దరూ కలిసి మూవీకి రావడంతో ‘సలార్ 2’ పనులపై చర్చించేందుకు కావచ్చు అనే అంచనాలు వచ్చాయి. కాని ఆ విషయంపై అధికారికంగా ఏమీ బయటకు రాలేదు. చాలాకాలం తర్వాత థియేటర్‌కి వచ్చిన డార్లింగ్‌ను చూసిన వారు, ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మమ్మల్ని మధ్యలో కూర్చుని సినిమా చూస్తున్నాడు అంటూ భావోద్వేగంతో కామెంట్లు పెడుతున్నారు.
ఇంకొందరు డార్లింగ్ థియేటర్‌లోకి వచ్చాడుగా.. అని సరదాగా స్పందిస్తున్నారు. సాధారణంగా ప్రభాస్ సినిమాల మధ్య పబ్లిక్ ప్లేసెస్‌లో కనిపించడు. పార్టీలకైనా, ఫంక్షన్లకైనా వెళ్లకుండా మినిమమ్ లైఫ్‌స్టైల్ ఫాలో అవుతుంటారు. అందుకే ఈ క్యాజువల్ థియేటర్ విజిట్ అభిమానులకు చాలామందికి ఖుషీని కలిగించింది. ఈ ఒక్క క్లిక్‌తోనే సోషల్ మీడియాలో ఊహించని బజ్ వచ్చింది. ఇక ప్రభాస్ న్యూ లుక్ కూడా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. బాహుబలి అనంతరం డార్లింగ్ లుక్స్ పై రకరకాల కామెంట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం మిర్చి లాంటి స్టైల్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
