ప్రభాస్@ఇటలీ.. మళ్లీ వచ్చేదెప్పుడు?
అయితే ఇప్పుడు ప్రభాస్ వెకేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇటలీలోని ఓ ఏరియాలో సేద తీరుతున్నట్లు సమాచారం.
By: Tupaki Desk | 21 April 2025 12:47 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కొంత కాలంగా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన.. మరో రెండేళ్ల పాటు క్షణం తీరిక లేకుండా గడపనున్నారు. ఇప్పటికే అనేక సినిమాలను లైన్ లో పెట్టేశారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వస్తున్నారు డార్లింగ్.
అయితే ఇప్పుడు ప్రభాస్ వెకేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇటలీలోని ఓ ఏరియాలో సేద తీరుతున్నట్లు సమాచారం. వేసవి ముగిసే వరకు అక్కడే ఉంటారని టాక్ వినిపిస్తోంది. మే నెల చివర్లో మళ్లీ ఆయన ఇండియాకు తిరిగి వస్తారని వినికిడి. ఇటలీలో ఇప్పుడు ఫుల్ కూల్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ చిల్ అవుతున్నారట.
ఇక ఇటలీలో ప్రభాస్ కు ఓ కాస్ట్ట్లీ ప్రాపర్టీ ఉందని, అక్కడే ఎప్పుడు గడుపుతుంటారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. షూటింగ్ షెడ్యూల్స్ మధ్య బ్రేక్స్ లో ప్రభాస్ ఎప్పటికప్పుడు ఇటలీ వెళ్తూనే ఉంటారు. అక్కడ రిలాక్స్ అయ్యి.. మళ్లీ హైదరాబాద్ కు తిరిగి వస్తుంటారు. అయితే ఇటలీలో తన అభిరుచులకు అనుగుణంగా ప్రాపర్టీ కొన్నారని టాక్.
అదే సమయంలో ప్రభాస్ ప్రస్తుతం అటు మారుతి రాజా సాబ్.. ఇటు హను రాఘవపూడి సినిమాలను పూర్తి చేస్తున్నారు. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ ఇంకా కొద్ది రోజుల మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని పాటలతోపాటు చాలా తక్కువ టాకీ పార్ట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని సమాచారం.
అయితే హను రాఘవపూడి మూవీ పనులు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. పీరియాడికల్ యాక్షన్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. దీంతో వచ్చే ఏడాది సమ్మర్ కు సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. అందుకు అనుగుణంగా మొత్తం ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇక రాజా సాబ్ ఈ ఏడాదిలో విడుదల కావాల్సి ఉంది. దసరాకు వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేకుంటే సంక్రాంతికి అయినా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ప్రభాస్ చేతిలో ఇంకా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, ప్రశాంత్ నీల్ సలార్-2, నాగ్ అశ్విన్ కల్కి-2 ఉన్నాయి. మరి ఆ సినిమాలన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో.. ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే.. అన్నీ బడా సినిమాలే.
