ప్రభాస్ కు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు.. ఎందుకంటే
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Tupaki Desk | 11 July 2025 1:09 PM ISTబాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ దేశంలోని ప్రతీ ఒక్కరినీ మెప్పించడంతో పాటూ ఆ క్రేజ్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. బాహుబలి తర్వాత చేసిన జానర్ లో సినిమాలు చేయకుండా ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నారు ప్రభాస్.
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో చాలా క్రేజీ సినిమాలున్నాయి. అందులో ఇప్పుడు రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అవే ది రాజా సాబ్, ఫౌజీ. మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ చేస్తున్న ప్రభాస్ ఆ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. అంతేకాదు తన కెరీర్లోనే మొదటి సారి ప్రభాస్ ఈ సినిమాను హార్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో చేస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
దీంతో పాటూ సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ అనే సినిమాను చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారని ఇప్పటికే లీకులందాయి. ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది. రాజా సాబ్, ఫౌజీ సినిమాలను ప్రభాస్ సమాంతరంగా చేసుకుంటూ వస్తున్నారు.
ఈ రెండూ పూర్తవగానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేయనున్న ప్రభాస్ ఆ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. వీటితో పాటూ సలార్2, కల్కి2 లో కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కు సంబంధించిన ఓ పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ప్రభాస్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన మొదటి సినిమా ఈశ్వర్ పూజ టైమ్ లో ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు, ఈ ఈశ్వర్ కు మూడు గుండెలు అనే డైలాగ్ చెప్పానని, ఆ డైలాగ్ ఎలా చెప్పానో కూడా తెలియదని, టెన్షన్ లో చెప్పేశానని, ఆ డైలాగ్ చెప్పాక తన తండ్రి తన చెయ్యి పట్టుకుని యస్ అనడంతో ఫస్ట్ టైమ్ కళ్లలో నీళ్లు తిరిగాయని ప్రభాస్ ఆ వీడియోలో గుర్తు చేసుకోగా, ఇప్పుడా వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
