ప్రభాస్ దీపికా రొమాన్స్.. కెవ్వు కేక..!
ప్రభాస్ సందీప్ వంగ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అన్న వేట మొదలైంది.
By: Tupaki Desk | 3 May 2025 8:00 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె కలిసి లాస్ట్ ఇయర్ కల్కి 2898 AD సినిమా చేశారు. సినిమాలో ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కానీ అందులో వారి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ లేదు. ఎందుకంటే కల్కి కథ ఆ సెటప్ అంతా వేరు. ఐతే దీపికతో ప్రభాస్ రొమాన్స్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రభాస్ సందీప్ వంగ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అన్న వేట మొదలైంది.
బాలీవుడ్ నుంచి కొందరిని సౌత్ స్టార్ హీరోయిన్స్ ఇలా అందరిని అనుకుని ఫైనల్ గా దీపిక పదుకొనె ఐతే పర్ఫెక్ట్ అనుకున్నారట. ప్రభాస్ తో దీపిక ఆల్రెడీ కల్కి చేసింది. కాకపోతే ఆ సినిమా లో వారిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కానీ ఎలాంటి రొమాన్స్ లేదు. అందుకే సందీప్ స్పిరిట్ లో దీపికని తీసుకున్నారట. ప్రభాస్ తో నటించేందుకు దీపిక పదుకొనె కూడా ఓకే అనేసిందట.
ఐతే సందీప్ వన సినిమాలో హీరో హీరోయిన్ రొమాన్స్ గురించి తెలిసిందే. ప్రభాస్ దీపిక ఇద్దరు సినిమాలో తప్పకుండా రొమాన్స్ తో అదరగొట్టేస్తారని ఫిక్స్ అవ్వొచ్చు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూడు సినిమాలతోనే సందీప్ సినిమా బ్రాండ్ ఏంటన్నది చూపించాడు. ఇప్పుడు ప్రభాస్ తో చేసే స్పిరిట్ ని కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నాడు. ప్రభాస్ స్పిరిట్ తప్పకుండా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా చేస్తుందని అంటున్నారు.
పెళ్లైనా సరే దీపిక జోరు ఎక్కడ తగ్గట్లేదు. ప్రస్తుతం అమ్మడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో కింగ్ సినిమాలో నటిస్తుంది. షారుఖ్ తో ఇప్పటికే ఐదు సినిమాల్లో నటించిన దీపిక పదుకొనె ఆరోసారి జత కడుతుంది. ప్రభాస్ తో దీపిక కూడా కల్కి 1 లో నటించగా కల్కి 2లో కూడా ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఐతే స్పిరిట్ లో ప్రభాస్, దీపిక జోడీ మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని అంటున్నారు.
ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ చేస్తున్నాడు. ఆ సినిమా ఈ ఇయర్ రిలీజ్ కాబోతుంది. హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫౌజీ కూడా సెట్స్ మీద ఉంది.
