దీపిక రుచిని ప్రభాస్ వదల్లేకపోతున్నాడా!
దీపికా పదుకొణే ఇష్టంగా తినే ఆహారం ఒకటుంది. అదే క్విన్వో. ఇది పూర్తిగా శాఖాహారం. కూరగాయలు..రకరకాల పప్పులు...మసాలా దినుసులతో ఈ ఐటమ్ తయారు చేస్తారు.
By: Tupaki Desk | 23 July 2025 5:00 AM ISTడార్లింగ్ ప్రభాస్ నాన్ వెజ్ ప్రియుడు. ముక్క లేనిదే ముద్ద దిగదు. తన చుట్టూ ఉండే వాళ్లు కూడా అదే తరహా రుచులని ఆస్వాదించాలనుకుంటాడు. అందుకే తన ఇంటి నుంచి ప్రత్యకంగా వండించి మరీ సహ నటులకు, హీరోయిన్లకు పంపిస్తుంటాడు. ఈ విషయంలో హీరోయిన్లకు ప్రభాస్ ఎంతో ప్రత్యేకం. ప్రభాస్ ఇంట రుచులన్నింటిని దీపికా పదుకొణే కూడా `కల్కి` షూటింగ్ సమయంలో ఆస్వాదించింది. ప్రభాస్ పంపించిన స్పెషల్ వంటకాల గురించి చెప్పి ఎంతో మురిసిపోయింది.
మరి ప్రభాస్ కి దీపికా ఇష్ట వంట కాన్ని రుచి చూపించిందా? అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపికా పదుకొణే ఇష్టంగా తినే ఆహారం ఒకటుంది. అదే క్విన్వో. ఇది పూర్తిగా శాఖాహారం. కూరగాయలు..రకరకాల పప్పులు...మసాలా దినుసులతో ఈ ఐటమ్ తయారు చేస్తారు. రిచ్ కిడ్స్ ఎక్కువగా రిచ్ రెస్టారెంట్ లో ప్రిపర్ చేసే ఐటమ్ ఇది. ఈక్విన్వో దీపిక ఎంతో ఇష్టంగా తింటుందిట. స్వయంగా తాను కూడా చేయడం నేర్చుకుందిట. దీపికకు బాగా తెలిసిన వంటకం కూడా ఇదేనట.
భర్త రణవీర్ సింగ్ కూడా స్వయంగా వండి ఎంతో ప్రేమతో వడ్డిస్తుందిట. ఇదే ఐటమ్ ను ప్రభాస్ కోసం దీపిక స్పెషల్ వంటకంగా చేసి తిని పించిందిట. అప్పటి వరకూ ఈ ఐటమ్ గురించి ప్రభాస్ కి కూడా తెలియదట. దీపిక రుచి చూపించడంతో అప్పటి నుంచి రెస్టారెంట్ కి వెళ్లిన ప్రతీసారి తన ఆహారంలో క్విన్వో కూడా ఉండేలా చూసుకుంటున్నాడుట. డార్లింగ్ దీపికను అడిగి రెసిపీ గురించి కూడా అడిగి తెలు సుకున్నాడుట. మొత్తానికి ప్రభాస్ మెచ్చిన వెజ్ వంటకం లిస్ట్ లో కొత్తగా ఇది కూడా యాడ్ అయిందన్న మాట.
రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ లో ఇంకెన్ని రుచులు తెరపైకి వస్తాయో చూడాలో. ప్రభాస్ -దీపిక పదుకొణే `కల్కి 2` షూటింగ్ కూడా పూర్తి చేయాలి. ఇద్దరి మధ్య అసలైన కాంబినేషన్ సన్నివేశాలు రెండవ భాగంలోనే ఉంటాయి. ఈ భాగానికి సంబంధించి షూటింగ్ డేస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. వచ్చే ఏడాది `కల్కి 2` మొదలవుతుంది.
