Begin typing your search above and press return to search.

స్పిరిట్ కోసం రెబలోడి విధ్వంసం..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వరుస సినిమాలతో అదరగొడుతున్న ప్రభాస్ ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   19 July 2025 7:43 PM IST
స్పిరిట్ కోసం రెబలోడి విధ్వంసం..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వరుస సినిమాలతో అదరగొడుతున్న ప్రభాస్ ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇయర్ డిసెంబర్ లో రాజా సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమా తో పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ సినిమాను కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేసేలా చూస్తున్నారట.

ప్రభాస్ నెక్స్ట్ సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా విషయంలో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఐతే స్పిరిట్ లో ప్రభాస్ ని కొత్తగా చూపించాలని ఫిక్స్ అయ్యాడు సందీప్ వంగ. ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఐతే తన ప్రతి సినిమా హీరో విషయంలో హీరో క్యారెక్టర్ ఆర్క్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ వచ్చిన సందీప్ ప్రభాస్ స్పిరిట్ కోసం కూడా అదిరిపోయే రేంజ్ లో సెట్ చేస్తున్నాడట.

స్పిరిట్ కోసం రెబలోడి రచ్చ మామూలుగా ఉండదని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ మేకోవర్ కూడా వేరే లెవెల్ అనేలా ఉంటుందని టాక్. త్వరలో సెట్స్ మీదకు వెళ్తున్న ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో ప్రతి విషయాన్ని సందీప్ చాలా కేర్ ఫుల్ గా డీల్ చేస్తున్నాడట. సినిమా షూటింగ్ మొదలు పెట్టడమే మొదలు పూర్తి చేసే దాకా ఆగకూడదని ఫిక్స్ అయ్యాడట.

ప్రభాస్ అనుకున్న విధంగా డేట్స్ ఇస్తే మాత్రం సందీప్ స్పిరిట్ సినిమాను వన్ ఇయర్ లో పూర్తి చేయాలని చూస్తున్నాడు. అంటే 2026 చివర్లో లేదా 2027 మొదట్లో స్పిరిట్ ని దించే ఛాన్స్ ఉంది. ప్రభాస్ స్పిరిట్ లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

సందీప్ వంగ సినిమా అనగానే హీరో ఎరగెంట్ మాస్ విధ్వంసం గుర్తొస్తుంది. ఇక మాస్ కి కేరా అడ్రస్ అయిన బాహుబలి ప్రభాస్ తో సందీప్ చేసే స్పిరిట్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. స్పిరిట్ సినిమా చేసే ముందే ప్రభాస్ గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారు అని ఒక ఇంటర్వ్యూలో సందీప్ ని అడిగితే.. అది స్పిరిట్ లో చూపిస్తా అని ఆన్సర్ ఇచ్చాడు. సో ప్రభాస్ ఏంటో స్పిరిట్ బొమ్మ లో తన మేకింగ్ లో చూస్తారని సందీప్ చెప్పకనే చెప్పాడు.