Begin typing your search above and press return to search.

'వరల్డ్ లో టాప్ హీరో'.. ప్రభాస్ పై మోహన్ బాబు ప్రశంసలు.

"ఓకే బావ రా ప్రభాస్ అనగా.. ఓ పని మీద వస్తున్నా అని చెప్పి నేను వెళ్లా.. కూర్చుని కన్నప్ప మూవీలో ఈ క్యారెక్టర్ ఉంది.

By:  Tupaki Desk   |   8 Jun 2025 9:35 AM IST
వరల్డ్ లో టాప్ హీరో.. ప్రభాస్ పై మోహన్ బాబు ప్రశంసలు.
X

మంచు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తూ.. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. మంచు విష్ణు లీడ్ రోల్ లో నటిస్తుండగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్యామియో రోల్ పోషించగా.. మోహన్ బాబు రీసెంట్ గా గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ విషయంపై మాట్లాడారు.

"నాకంటే చిన్నవాడు.. కానీ నేను ప్రభాస్ ను బావ అంటాను. కొన్నేళ్లుగా బావ బావ అనుకుంటాం. నా సినిమాలో చేశాడని చెప్పడం కాదు.. చేసున్నా చేసుండకపోయినా.. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. నేను మామూలుగా ఫోన్ చేసి ఏం బావ.. ఏం బావ.. అనుకుంటూ ఇంటికి రానా అంటూ అడిగాను" అని మోహన్ బాబు తెలిపారు.

"ఓకే బావ రా ప్రభాస్ అనగా.. ఓ పని మీద వస్తున్నా అని చెప్పి నేను వెళ్లా.. కూర్చుని కన్నప్ప మూవీలో ఈ క్యారెక్టర్ ఉంది. ఇన్ని.. రోజుల వర్క్ చేయాల్సి ఉంది. నీవు చేయాల్సిన అవసరం లేదు. నీవు ఇండియాలో టాప్ హీరో.. ఇండియాలోనే కాదు.. వరల్డ్ లో కూడా.. అంతటి గొప్ప వాడివి నీవు అని చెప్పా" అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

"కానీ ఈ రోజు కాదన్నా.. నేను తన మూవీలో యాక్ట్ చేస్తానని చెప్పా.. దానికి దీనికి సంబంధం లేదని చెప్పా.. వెంటనే బావ దీనికి నీవు రావాలా.. నేను విష్ణు మాట్లాడుకుంటాం.. నేను డోయింగ్ అని ప్రభాస్ చెప్పారు. ఒకే మాట.. అది చాలు.. ఒక రోజు వచ్చారు.. సినిమా చేశారు".. అని మోహన్ బాబు తెలిపారు.

"ప్రభాస్ కోసం ఇంతకంటే చెప్పలేను. ఆయన కుటుంబమంటే నాకెంతో ఇష్టం.. కృష్ణంరాజు గారు.. ప్రభాస్ నాన్న గారు.. ప్రభాస్ వందేళ్ల క్షేమంగా ఆ దేవుడి ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటున్నా" అని చెప్పారు మోహన్ బాబు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ప్రభాస్ తో అనుబంధం అంటే అట్ల ఉంటదని కామెంట్లు పెడుతున్నారు.

కాగా, కన్నప్పలో ప్రభాస్ రుద్ర రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఆ పాత్రను మేకర్స్ పరిచయం చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తన రోల్ కు కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని ఇప్పటికే మంచు విష్ణు వెల్లడించారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపారు. మరి సినిమాలో ప్రభాస్ ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.