ప్రభాస్ లేకపోయినా ఆగట్లేదుగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో చేస్తున్న ది రాజా సాబ్ సినిమా కాగా, రెండోది సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఫౌజీ.
By: Tupaki Desk | 23 April 2025 5:14 AMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో చేస్తున్న ది రాజా సాబ్ సినిమా కాగా, రెండోది సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఫౌజీ. ఈ రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తూ వస్తున్నాడు ప్రభాస్.
కానీ ప్రస్తుతం ప్రభాస్ రెస్ట్ లో ఉన్న విషయం తెలిసిందే. మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉండమని ప్రభాస్ కు డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ఆయన గత కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎలాగూ రెస్ట్ లో ఉండటంతో ఖాళీ దొరికిన ప్రభాస్ వెకేషన్ కోసం ఇటలీ వెళ్లాడు. త్వరలోనే ప్రభాస్ తిరిగి షూటింగ్ లో జాయిన్ కానున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
అయితే గత కొన్నాళ్లుగా ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో అతను చేస్తున్న సినిమాలు ఆగిపోయాయి. ప్రభాస్ లైనప్ లో ఎన్నో పెద్ద ప్రాజెక్టులున్నప్పటికీ వాటన్నింటికీ బ్రేక్ వచ్చింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ వల్ల లేటవుతూ వస్తుంది మరియు ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపేశారు.
సందీప్ రెడ్డి వంగా తో చేయాల్సిన స్పిరిట్ సినిమా సెప్టెంబర్ కు వాయిదా పడినట్టు తెలుస్తోంది. కల్కి2 సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో సెట్స్ పైకి వెళ్తుందనుకుంటే అది నెక్ట్స్ ఇయర్ కు పోస్ట్‌పోన్ అయినట్టు చెప్తున్నారు. ఇక ప్రశాంత వర్మతో సినిమా, సలార్2 షూటింగ్ జరగాలంటే 2027 లోకి ఎంటర్ అవాల్సిందే. ప్రభాస్ కొన్ని రోజులు అందుబాటులో లేకపోవడం వల్ల తను సెట్ చేసుకున్న ప్రాజెక్టులు మొత్తం డిస్ట్రబ్ అయిపోయినప్పటికీ హను రాఘవపూడి ఫౌజీ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.
డైరెక్టర్ హను రాఘవపూడి హీరోయిన్ ఇమాన్వితో మరియు సినిమాలోని మాంటేజ్ సీన్స్ ను ఈ గ్యాప్ లో షూట్ చేస్తున్నాడట. ప్రభాస్ బ్రేక్ లో ఉన్నప్పటికీ ఫౌజీ షూటింగ్ ను ముందుకు తీసుకెళ్తూ అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు హను రాఘవపూడి. వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీగా హను ఈ సినిమాను రూపొందిస్తున్నాడని సమాచారం. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతుంది.