పాన్ ఇండియా స్టార్ యాక్షన్ తో బరిలోకి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` మొదలైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Nov 2025 12:55 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. డార్లింగ్ ప్రభాస్ కూడా గురువారం నుంచి సెట్స్ కు వెళ్తున్నాడు. దీనిలో భాగంగా తొలి రోజే యాక్షన్ సీక్వెన్స్ తో ప్రభాస్ చిత్రీకరణ మొదలు పెట్టారు. ప్రత్యేకంగా సిద్దం చేసిన ఓ భారీ సెట్ లో ఈ యాక్షన్ సన్నివేశం షూటింగ్ జరుగుతోంది. ఈ భారీ సెట్ లోనే కొన్ని రోజలు పాటు నిర్విరామంగా ఈ సన్నివేశం చిత్రీకరించనున్నారుట. సినిమా ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వచ్చే యాక్షన్ సన్నివేశం అట ఇది.
పోలీస్ కటౌట్ పీక్స్ లోనే:
ఈ నేపథ్యంలో సెంటిమెంట్ గా భావించి సందీప్ ఈ సన్నివేశంతోనే షూటింగ్ మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో ప్రభాస్ పవర్ పుల్ పోలీస్ పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. పోలీస్ వ్యవస్థనే శాషించే రేంజ్ లో ఆ రోల్ ఉంటుందని అంటున్నారు. సాధారణ హీరోనే సందీప్ ఓ రేంజ్ లో లేపుతాడు. అలాంటి ప్రభాస్ లాంటి స్టార్ పోలీస్ పాత్ర అంటే ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ పాత్రపై అభిమానుల్లోనూ భారీ హైప్ ఉంది. ఈ పాత్రకు సంబంధించి సందీప్ ఇప్పటికే కొన్ని రకాల హింట్స్ కూడా ఇచ్చేసాడు.
కెరీర్ లో తొలిసారి పోలీస్ గెటప్:
రెండు రకాల రేర్ డ్రగ్స్ కలిపి కొడితే? ఎలా ఉంటుందో? ప్రభాస్ రోల్ అంత కిక్ ఇస్తుందన్నాడు. దీంతో `అర్జున్ రెడ్డి` , `యానిమల్` చిత్రాల్లో ఆ రెండు పాత్రలకు పదింతలు మించి ప్రభాస్ రోల్ ఉంటుందని ఓ అంచనాకి వచ్చేసారు ఫ్యాన్స్. సందీప్ కథల్లో భారీ డైలాగు..పవర్ పుల్ పంచ్ లుండవు. హీరో కి ఓ కొత్త యాటిట్యూడ్ ని ఆపాదించి ఊచకోత కోయడమే అన్నట్లు సాగుతుంది. దీంతో తొలి షెడ్యూల్ కోసమే ప్రభాస్ కాఖీ దుస్తులు ధరించినట్లు తెలుస్తోంది. ఇంతవరకూ ప్రభాస్ ఏ సినిమాలోనూ పోలీస్ పాత్రలు పోషించలేదు.
వెనక్కి తగ్గే నటి కాదు:
చాలా సినిమాల్లో యాక్షన్ స్టార్ గా కనిపించాడు గానీ..యూనిఫాం ధరించి ప్రత్యర్ధుల తాట తీసేలా కనిపించలేదు. ఈసారి ఆ బాధ్యత తీసుకుంటున్నాడు. ఇందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ నటి త్రిప్రీ డిమ్రీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరి ఆమె పాత్ర ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరం. సందీప్ తన సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం బొమ్మ మాత్రమే కాదంటాడు. నటిగా అన్ని రకాలుగా ఆమె పాత్రను హైలైట్ చేస్తుంటాడు. వీలైనంత వరకూ హీరోయిన్ లో బోల్డ్ యాంగిల్ ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. త్రిప్తీ డిమ్రీ ఆ విషయంలో ఎక్కడా తగ్గే నటి కాదు.
