ప్రభాస్ ల్యాండ్ మార్క్ ఆర్డర్ మారిందిలా!
కానీ 'స్పిరిట్' స్థానంలో 'పౌజీ' కనిపిస్తుంది. 24వ చిత్రంగా 'దిరాజాసాబ్' తెరకెక్కుతుండగా , 25 వ చిత్రంగా హనురాఘవపూడి దర్శకత్వంలో 'పౌజీ' పట్టాలెక్కింది.
By: Tupaki Desk | 22 Jun 2025 11:24 PM ISTస్టార్ హీరోలంతా తమ ల్యాండ్ మార్క్ చిత్రాలు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. 25వ సినిమా ..50వ చిత్రం ...75వ చిత్రం..100 చిత్రం ఇలా తొలి సెంచరీ నమోదయ్యే వరకూ 25 వ చిత్రాన్ని సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేస్తుంటారు. ఈ ప్లానింగ్ ఎక్కడా తప్పకుండా చూసుకుంటారు. అవసరమైతే ఆ కాంబినేషన్ కోసం కొంత సమయాన్ని కూడా కేటాయిస్తుంటారు. ఈ వ్యవధిలో హీరోకి కొంత నష్టం కూడా తప్పదు.
అయినా ల్యాండ్ మార్క్ చిత్రానికి ఉన్న ప్రాధాన్యత అలాంటిది కాబట్టి పట్టించుకోరు. ఇక పాన్ ఇండియా స్టార్లు అయితే మరింత కేర్ పుల్ గా వ్యవహరిస్తుంటారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన 25వ చిత్రాన్ని ఇలాగే ప్లాన్ చేసుకున్నాడు. కొడితే ఇండియా షేక్ అయ్యేలా బ్లాక్ బస్టరే కొట్టాలని..అందుకు తగ్గ దర్శకు డిని సెట్ చేసిపెట్టుకున్నాడు. అతడే సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ 25వ అతడి దర్శకత్వంలో 'స్పిరిట్' అవ్వాలి.
కానీ 'స్పిరిట్' స్థానంలో 'పౌజీ' కనిపిస్తుంది. 24వ చిత్రంగా 'దిరాజాసాబ్' తెరకెక్కుతుండగా , 25 వ చిత్రంగా హనురాఘవపూడి దర్శకత్వంలో 'పౌజీ' పట్టాలెక్కింది. వాస్తవానికి 'పౌజీ' ప్రభాస్ లిస్ట్ లోనే లేదు. రాజాసాబ్ చేస్తోన్న సమయంలో హనురాఘవపూడి అనుకోకుండా ప్రభాస్ కు 'పౌజీ' కథ వినిపించడం..అది నచ్చ డంతో డార్లింగ్ ఒకే చేయడమే కాకుండా వెంటనే పట్టాలెక్కించడం చేసాడు.
దీంతో 'స్పిరిట్' వెనక్కి వెళ్లిపోయింది. అయితే ఇక్కడో బలమైన కారణం కూడా ఉంది. 'స్పిరిట్' చిత్రం చేస్తున్న సమయంలో ప్రభాస్ మరో సినిమా చేయడానికి వీలు లేదు. పూర్తిగా సందీప్ రెడ్డికి బాండ్ అయి పనిచేయాలనే కండీషన్ పెట్టాడు. కానీ రాజాసాబ్ కూడా ఉండటంతో డార్లింగ్ ఆ మాట ఇవ్వలేకపోయాడు. దీంతో 25వ చిత్రంగా పౌజీ ..26వ చిత్రంగా స్పిరిట్ మారాయి. అదీ సంగతి.
