2025 లో డార్లింగ్ అలా సరిపెట్టాడు!
మూడేళ్లగా డార్లింగ్ ప్రభాస్ నుంచి క్రమం తప్పకుండా హీరోగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 16 Nov 2025 1:00 AM ISTమూడేళ్లగా డార్లింగ్ ప్రభాస్ నుంచి క్రమం తప్పకుండా హీరోగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2022 లో `రాధేశ్యామ్`, 2023 లో `ఆదిపురుష్`, `సలార్ సీజ్ పైర్` లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. గత ఏడాది `కల్కి 2898` తో ప్రేక్షకుల్ని ఏకంగా ఓ కొత్త లోకంలోకే తీసుకెళ్లారు. మరి 2025 సంగతేంటి? మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదికిలోకి అడుగు పెట్టబోతున్నాం? అలాంటి సమయంలో 2025 లో ఎలాంటి చిత్రాలతో డార్లింగ్ అలరించారు? ంఅంటే పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్ గానే 2025ని ముగిస్తున్నట్లు కనిపిస్తోంది.
మూడు సినిమాలతో అలా:
ఈ ఏడాది ప్రభాస్ గెస్ట్ పాత్రలకే పరిమితమయ్యారు. మంచు విష్ణు హీరోగా నటించిన `కన్నప్ప` లో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించారు. కానీ ఆ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. కామియో పరంగా ప్రభాస్ కి ఈ సినిమా కలిసి రాలేదు. ఇటీవలే రిలీజ్ అయిన `మిరాయ్` లో మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చారు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ వాయిస్ ఓవర్ కూడా సినిమాకు కలిసొచ్చింది. తాజాగా `బాహుబలి ది ఎపిక్` తోనూ డార్లింగ్ థియేటర్లోకి వచ్చాడు.
రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా:
`బాహుబలి` రెండు భాగాలను కలిపి ఒకే భాగంగా ఈ చిత్రం రిలీజ్ అవ్వడంతో డార్లింగ్ అభిమానులకు కొంతవరకు ఉపశమనం దొరికింది. సోలో రిలీజ్ లు లేని సమయంలో `బాహుబలి` రిలీజ్ అన్నది అభిమానులకు కాస్త దగ్గర చేసింది. అంతకు మించి 2025 లో డార్లింగ్ అభిమానులకు కొత్త సినిమా ట్రీట్ ఇచ్చిందంటూ ఏదీ లేదు. `ది రాజాసాబ్` మాత్రం ఇదే డాది రిలీజ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసారు కానీ సాధ్యపడలేదు. చిత్రీకరణ పూర్తయిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా రిలీజ్ అవ్వలేదు. అలాగే `పౌజీ` కూడా భారీ సినిమా కావడంతో? రిలీజ్ ఉండదని ముందు నుంచి క్లారిటీ ఉండనే ఉంది. అయితే 2026 లో మాత్రం అన్ని లెక్కలు సరి చేస్తాడు.
లైన్ లో భారీ ప్రాజెక్ట్ లు:
బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లతో అలరించడం లాంఛనమే. జనవరి లో `రాజాసాబ్` రిలీజ్ అవుతుంది. అటుపై ఆరు నెలల గ్యాప్ లోనే `పౌజీ` కూడా రిలీజ్ అవుతంది. ఆగస్టు లో ఆ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అదే ఏడాది ఆరంభంలో భారీ అంచనాల మద్య `స్పిరిట్` కూడా మొదలవుతుంది. ఈ సినిమా రిలీజ్ కు మాత్రం సమయం పడుతుంది. కుదిరితే `కల్కీ 2`, `సలార్ 2` ని కూడా ఇదే ఏడాది ప్రారంభిస్తారు. ఈ రెండు సినిమాల రిలీజ్ కు మాత్రం సమయం ఎక్కువగానే పడుతుంది.
