Begin typing your search above and press return to search.

మారుతితో ప్రభాస్.. ఇది అసలు కథ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అతను చేస్తోన్న సినిమాలన్నీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం.

By:  Tupaki Desk   |   13 Dec 2023 12:30 AM GMT
మారుతితో ప్రభాస్.. ఇది అసలు కథ
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అతను చేస్తోన్న సినిమాలన్నీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న సలార్ సిరీస్ లో మొదటి పార్ట్ డిసెంబర్ 22న రిలీజ్ కావడానికి సిద్ధం అవుతోంది. ఈ మూవీపై ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బాహుబలి నుంచి ప్రభాస్ నుంచి యాక్షన్, హై లెవల్ సినిమాలే అన్ని వస్తున్నాయి.

సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు మూడు నెక్స్ట్ లెవల్ లోనే ప్రెజెంట్ చేశారు. సలార్ తర్వాత కల్కి 2898 ఏడీ, స్పిరిట్ సినిమాలు ఉన్నాయి. మధ్యలో మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కెరియర్ లో ఎక్కువగా చిన్న సినిమాలు, మీడియం రేంజ్ బడ్జెట్ మూవీస్ మాత్రమే మారుతి ఇంత వరకు చేస్తున్నాడు.

అతని ట్రాక్ లో ఒక్క నాని తప్ప టైర్ 1 హీరోలు ఎవరు లేరు. అలాగే బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా అంటే భలే భలే మగాడివోయ్ మాత్రమే. అయితే లోబడ్జెట్ లో మూవీస్ చేస్తూ సక్సెస్ కొట్టడం మారుతి స్టైల్. పెద్ద హీరోలతో ఎప్పుడు ట్రై చేయలేదు. అలాంటి మారుతికి ప్రభాస్ ఊహించని విధంగా సినిమా ఛాన్స్ ఇచ్చారు. దీనికి కారణం ప్రభాస్ కి ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ మీద ఉన్న ఇంటరెస్ట్ అని తెలుస్తోంది.

మిర్చి నుంచి చూసుకుంటే ప్రభాస్ కెరియర్ లో అన్ని సీరియస్ మోడ్ లో నడిచే కథలే కనిపిస్తాయి. కానీ ఫుల్ ఎనర్జీ, కామెడీతో ఒక మూవీ చేయాలని చాలా రోజుల నుంచి ప్రభాస్ అనుకుంటున్నాడంట. సీరియస్ కథల నుంచి కాస్తా రిలాక్షేషన్ గా ఉంటుందని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో సాగే సబ్జెక్ట్ చేయాలని అనుకుంటున్న టైంలో మారుతి ఈ కథ చెప్పాడంట.

కథ నచ్చడంతో వెంటనే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని 100కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రభాస్ కూడా రెమ్యుననరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ షేర్ కి ఒకే చెప్పి మూవీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి మారుతి ఎలాంటి సక్సెస్ ని ప్రభాస్ కి ఇస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.