Begin typing your search above and press return to search.

పూజా బేబ్ కి పుష్ప రాజ్ ఛాన్స్..?

రెండు మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుండగా లేటెస్ట్ గా పుష్ప 2 లో కూడా పూజా హెగ్దే సర్ ప్రైజ్ ఉండబోతుందనే టాక్ మొదలైంది.

By:  Tupaki Desk   |   20 April 2024 3:28 PM GMT
పూజా బేబ్ కి పుష్ప రాజ్ ఛాన్స్..?
X

టాలీవుడ్ లో మొన్నటిదాకా తిరుగులేని ఫాం కొనసాగించిన పూజా హెగ్దే సడెన్ గా ఆఫర్లు లేక ఖాళీ అయిపోయింది. తెలుగులో ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నా పూజాని కేర్ చేయట్లేదు దర్శక నిర్మాతలు. అయితే పూజా హెగ్దే మాత్రం ఎలాంటి అవకాశం వచ్చినా చేసేందుకు రెడీ అంటుంది. రెండు మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుండగా లేటెస్ట్ గా పుష్ప 2 లో కూడా పూజా హెగ్దే సర్ ప్రైజ్ ఉండబోతుందనే టాక్ మొదలైంది.

అల్లు అర్జున్ తో డీజే, అల వైకుంఠపురములో సినిమాల్లో నటించిన పూజా ఆ రెండు సినిమాలతో సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు లేని టైం లో మరోసారి అమ్మడికి ఛాన్స్ ఇచ్చి లిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప 1 లో సమంత చేసిన ఉ అంటావా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. పుష్ప 2 లో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.

పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం దిశా పటాని, ఊర్వశి రౌతెలా, సమంత ఇలా చాలామంది పేర్లు వినిపించాయి ఇప్పుడు బుట్ట బొమ్మ పూజా హెగ్దే పేరు కూడా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం సినిమాలో పూజా బేబి స్పెషల్ సాంగ్ చేసింది. సో ఆ సెంటిమెంట్ ప్రకారంగా కూడా సుకుమార్ పూజా హెగ్దేని పుష్ప 2 లో తీసుకునే అవకాశం ఉంది. ఇదే కాదు ఎన్.టి.ఆర్ దేవర లో కూడా పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్. పుష్ప 2 , దేవర స్పెషల్ సాంగ్స్ కన్ ఫర్మ్ అయితే మాత్రం పూజా హెగ్దే తెలుగులో మళ్లీ ఫాం లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.

అయితే ఎవరు చేసినా సరే పుష్ప 1 లో ఉ అంటావా సాంగ్ తో సమంత చేసిన రేంజ్ లో చేస్తారా అని ఆడియన్స్ డౌట్ పడుతున్నారు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ అవ్వడంలో సమంత చేసిన ఈ సాంగ్ కూడా ఒక రీజన్ గా నిలిచింది. పుష్ప 2 లో అన్ని అంశాలతో పాటుగా స్పెషల్ సాంగ్ గురించి కూడా ఆడియన్స్ లో విపరీతమైన బజ్ ఏర్పడింది. అందులో ఎవరు నటిస్తారో కానీ ఆ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమా ఆగష్టు 15 న రిలీజ్ లాక్ చేశారు. సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 పై ఉన్న అంచనాల మేరకు నార్త్ సైడ్ లో అదిరిపోయే బిజినెస్ చేస్తుంది.