Begin typing your search above and press return to search.

ఒక్కో క్లిక్కు.. వన్స్ మోర్ అనేట్టు..!

By:  Tupaki Desk   |   24 Feb 2024 2:56 PM GMT
ఒక్కో క్లిక్కు.. వన్స్ మోర్ అనేట్టు..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ డైవర్స్ తీసుకున్నా అకిరా నందన్ ను పవర్ స్టార్ వారసుడిగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అకిరా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ అలర్ట్ అవుతుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ అకిరా, ఆద్యలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. లేటెస్ట్ గా అకిరా నందన్ కి తను ఒక సలహా ఇవ్వగా దాన్ని అలవాటు చేసుకున్నాడని చెబుతూ అకిరా వరి కలిగిన ఇయర్ ఫోన్ పెట్టుకున్న ఫోటోని షేర్ చేశారు రేణు దేశాయ్.

ఈ కాలం టెక్నాలజీ మోజులో పడకుండా పిల్లలకు చెప్పాల్సిన జాగ్రత్తలు పేరెంట్స్ చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అకిరా నందన్ కి కూడా వైర్ కలిగిన ఇయర్ ఫోన్స్ నే వాడమని రేణు దేశాయ్ చెప్పారట. అకిరా, ఆద్యాలకు తాను చెప్పిన ఈ సలహాను వారు పాటిస్తున్నారని చెప్పుకొచ్చారు. బ్లూట్ తూట్ వాడటం వల్ల చెవులు, బ్రెయిన్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే అకిరా తన అలవాటుని మార్చుకుని వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ని తీసేసి వైర్ తో కలిగిన ఇయర్ ఫోన్స్ ని వాడుతున్నాడట.

అకిరా వైర్ హెడ్ ఫోన్స్ వాడుతున్న ఫోటోని షేర్ చేసిన రేణు దేశాయ్ నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె ఇన్ స్టాలో రాసుకొచ్చారు. అకిరా నందన్ కి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ ఫోటోలను షేర్ చేస్తూ రేణు దేశాయ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అలరిస్తుంటారు. అకిరా నందన్ హీరోగా చేస్తే చూడాలని అప్పుడే ఫ్యాన్స్ హడావిడి మొదలు పెట్టారు. కానీ అకిరా తన ఫోకస్ అంతా మ్యూజిక్ మీద పెట్టాడని చెప్పుకుంటున్నారు.

అకిరా నందన్ కి సంబందించిన ఫోటోలకు రేణు దేశాయ్ షేర్ చేస్తూ ఇంకోటి మరోటి అనేలా చేస్తుంది. ఒక్కో క్లిక్ కూడా వన్ మోర్ అనేలా రేణు దేశాయ్ అకిరా నందన్ ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ అకిరా నందన్ ఏ రంగంలోకి వెళ్తాడు. అతను ఫ్యూచర్ లో ఏం చేస్తాడు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అకిరా ఫోటో వస్తే చాలు పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతుంటారు. రేణు దేశాయ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించిన ఆమె ఆ సినిమా సూపర్ హిట్ అయితే ఎలా ఉండేదో కానీ సినిమా నిరాశపరచడంతో మళ్లీ సినిమా చేయాలనే ఆలోచన చేయట్లేదు.