Begin typing your search above and press return to search.

నెగిటివ్ షేడ్స్ లో పవన్ క్యారెక్టర్?

ఏజెంట్ మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   9 Sep 2023 4:55 AM GMT
నెగిటివ్ షేడ్స్ లో పవన్ క్యారెక్టర్?
X

ఏజెంట్ మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూవీ చేయనుండటం విశేషం. రామ్ తాళ్ళూరి నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే ఆఫీసర్ ఓపెన్ చేసి ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు.

అయితే ఈ సినిమా ఓ హిట్ మూవీ రీమేక్ అనే ప్రచారం కొద్దిరోజులుగా నడిచింది. తాజాగా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక మాఫియా లీడర్ కథగా దీనిని సిద్ధం చేస్తున్నారంట. వక్కంతం వంశీ ఈ మూవీకి కథ అందిస్తున్నారు. పవర్ ఫుల్ స్టోరీ లైన్ తోనే ఈ సినిమాని యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఏజెంట్ సినిమాలో చేసిన తప్పులు పవన్ కళ్యాణ్ మూవీ విషయంలో చేయకూడదని పక్కా బౌండెడ్ స్క్రిప్ సిద్ధం చేసుకునే పనిలో సురేందర్ రెడ్డి దృష్టి పెట్టారు. కథ మొత్తం సిద్ధం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కి నేరేషన్ ఇచ్చి ఫైనల్ చేసుకొని తరువాత యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారంట. రామ్ తాళ్ళూరి నిర్మాణం అంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టరు.

పీకే అత్యంత సన్నిహితులతో అతను ఒకరు. అందుకే సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ వర్క్ మీద ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎలక్షన్స్ తర్వాత ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారంట. ఈ చిత్రానికి సంబంధించి మరో ప్రత్యేకత కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇప్పటి వరకు నెగిటివ్ షేడ్స్ లో కనిపించలేదు. ఇందులో మాత్రం అతని పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉండబోతుందంట.

అలాగే హీరో తరహాలో కనిపించే ఇక మాఫియా డాన్ కథగా దీనిని డెవలప్ చేస్తున్నారంట. కేజీఎఫ్ తర్వాత నెగిటివ్ హీరోయిజం బాగా ట్రెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే సురేందర్ రెడ్డి అలాంటి కథని పవన్ కళ్యాణ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.