Begin typing your search above and press return to search.

రికార్డ్‌ : నటి ప్రగతి సౌత్ ఇండియన్ చాంపియన్‌

ప్రగతి సాధించిన విజయానికి సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు

By:  Tupaki Desk   |   22 Jan 2024 6:53 AM GMT
రికార్డ్‌ : నటి ప్రగతి సౌత్ ఇండియన్ చాంపియన్‌
X

తెలుగు వెండి తెర ప్రేక్షకులకు అమ్మగా, అక్క గా, అత్తగా ఎన్నో సినిమాల్లో నటించి వినోదాన్ని పంచి సుపరిచితురాలు గా నిలిచిన నటి ప్రగతి గత కొన్నాళ్లుగా సోషల్‌ మీడియా ద్వారా తెగ వైరల్‌ అవుతున్న విషయం తెల్సిందే. అయిదు పదుల వయసుకు చేరువలో ఉన్న నటి ప్రగతి జిమ్‌ లో ఎక్కువ సమయం గడిపే వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉండేవారు.

ఈ వయసులో ఈమె జిమ్‌ లో కష్టపడటం ఎందుకో అని కొందరు ఎద్దేవ చేశారు. అలాంటి వారు అందరికి కూడా చెంప పెట్టు అన్నట్లుగా ప్రగతి సమాధానం ఇచ్చింది. అరుదైన రికార్డును సొంతం చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిరిగి చూసే విధంగా, తెలుగు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా చేసింది.

నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్‌ లో ఏకంగా సౌత్ ఇండియన్‌ చాంపియన్‌ గా నిలిచింది. సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ సీనియర్‌, జూనియర్ కాంపిటీషన్ 2024 లో ప్రగతి రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ పతకం సాధించింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

ప్రగతి సాధించిన విజయానికి సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ప్రముఖ నటి అయ్యి ఉండి, ఈ వయసులో ఇలాంటి కష్టం ఏం పడుతాంలే అనుకోకుండా కష్టపడి పవర్ లిఫ్టింగ్‌ చాంపియన్ షిప్‌ లో రెండో స్థానంలో నిలిచిన ప్రగతి అభినందనీయురాలు. ముందు ముందు ఆమె మరిన్ని విజయాలు సాధించాలని మనము కోరుకుందాం.