Begin typing your search above and press return to search.

ఉప్ప‌ల్ స్టేడియానికి క‌రెంటు కోత‌

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దీనిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇప్పుడు ప‌వ‌ర్ క‌ట్ చేసారు.

By:  Tupaki Desk   |   4 April 2024 4:06 PM GMT
ఉప్ప‌ల్ స్టేడియానికి క‌రెంటు కోత‌
X

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పెండింగ్ బిల్లులను చెల్లించ‌క‌పోవ‌డంతో విద్యుత్ శాఖ ప‌వ‌ర్ క‌ట్ చేసింది. స్టేడియం క‌మిటీకి ఇప్ప‌టికే కోర్టు నోటీసులు పంపారు. కానీ విద్యుత్ బ‌కాయిలు కొన్నేళ్లుగా చెల్లించ‌లేద‌ని స‌మాచారం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దీనిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇప్పుడు ప‌వ‌ర్ క‌ట్ చేసారు.

స్టేడియంలో రూ.కోటికి పైగా విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందని అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) బాలకృష్ణ తెలిపారు. పెండింగ్ బిల్లుల కార‌ణంగా స్టేడియంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసినా యధావిధిగా విద్యుత్ వినియోగిస్తున్నట్లు స‌దరు అధికారి తెలిపారు. గతంలో విద్యుత్ చౌర్యంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)పై కూడా కేసు నమోదైంది. దీనిపై హెచ్‌సిఎ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు విద్యుత్ శాఖకు అనుకూలంగా తీర్పును కూడా ఇచ్చింది.

``15 రోజుల క్రితం నోటీసులు పంపాం. దానికి కూడా స్పందించ‌లేదు. 1.67 కోట్ల బ‌కాయిలు చెల్లించాల్సి ఉంద‌``ని విద్యుత్ శాఖ అధికారి ఒక‌రు తెలిపారు. కాగా రేపు ఉప్ప‌ల్ స్టేడియంలో ఎస్.ఆర్.హెచ్- సిఎస్ కే 20-20 మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉండ‌గా, విద్యుత్ క‌ట్ చేయ‌డం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.