వీరమల్లు దూకుడు పెంచాల్సిందే..!
హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ లో కూడా పెద్దగా ఎగ్జైట్ మెంట్ కనిపించట్లేదు. వీరమల్లు సినిమా ప్రమోషన్స్ పై కూడా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.
By: Tupaki Desk | 31 May 2025 8:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ఎట్టకేలకు జూన్ 12న రిలీజ్ అవుతుంది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం రత్నం నిర్మించిన ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి మొదలు పెట్టగా మధ్యలో జ్యోతి కృష్ణ టేకోవర్ చేసి పూర్తి చేశాడు. వీరమల్లు పార్ట్ 1 జూన్ 12న రిలీజ్ కాబోతుంది. ఐతే రెగ్యులర్ గా పవర్ స్టార్ సినిమా మరో రెండు వారాల్లో రాబోతుంది అంటే ఒక రేంజ్ లో హడావిడి ఉండేది. కానీ వీరమల్లు విషయంలో అదేది కనిపించట్లేదు.
హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ లో కూడా పెద్దగా ఎగ్జైట్ మెంట్ కనిపించట్లేదు. వీరమల్లు సినిమా ప్రమోషన్స్ పై కూడా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. సినిమాను నాలుగేళ్లకు పైగా తీశారు. రిలీజ్ టైం లో ప్రమోషన్స్ కూడా సంతృప్తికరంగా లేవని అంటున్నారు. ఎంత పవర్ స్టార్ సినిమా అయినా కూడా ప్రమోషన్స్ కంపల్సరీ.. ఈమధ్య స్టార్ సినిమాలకు కూడా బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తేనే ఆడియన్స్ కి రీచ్ అవుతుంది.
ఈ ప్రమోషన్స్ లో ముఖ్యంగా ఆడియన్స్ లోకి సినిమాను తీసుకెళ్లేలా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి సినిమా గురించి చెప్పే అవకాశం ఐతే ఉంది. ఇక మొత్తం బాధ్యత అంతా కూడా మిగతా కాస్ట్ మీద వేసుకోవాల్సిన అవసరం ఉంది. హరి హర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. చిత్ర యూనిట్ ఆమెతో అయినా ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయాలి.
పవన్ పూర్తి స్థాయి పాలిటిక్స్ లో బిజీ అవ్వడం వల్ల ఆయన నటించిన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనే టైం లేకుండా పోయింది. అసలే ముందునుంచి ఫ్యాన్స్ కి వీరమల్లు మీద అంతగా గురి లేదు రిలీజ్ రెండు వారాలే ఉన్నా ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయట్లేదు అనుకుంటున్నారు. మరి వీరమల్లు యూనిట్ ఈ విషయంలో కాస్త ఫోకస్ చేసి ప్రమోషన్స్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఐతే పవర్ స్టార్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండది. సో మొదటి ఆట టాక్ బాగుంది అంటే సినిమా హిట్ అయినట్టే లెక్క.
