కృష్ణ చైతన్య 'పవర్‌పేట'.. నలిగిన గులాబీ.. చిందిన రక్తం
టాలీవుడ్‌లో మంచి కంటెంట్ తో సినిమాలు తీసే దర్శకులతో కృష్ణ చైతన్య ఒకరు.
By: M Prashanth | 16 April 2026 9:53 AM ISTటాలీవుడ్‌లో మంచి కంటెంట్ తో సినిమాలు తీసే దర్శకులతో కృష్ణ చైతన్య ఒకరు. అతను రాసుకునే కథల్లో ఒక రకమైన ఇంటెన్సిటీ ఉంటుంది. ‘రౌడీ ఫెలో’ నుంచి మొన్నటి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వరకు ప్రతి సినిమాలోనూ ఒక లోకల్ నెటివిటీని, అక్కడి పాలిటిక్స్‌ను చాలా 'రా' గా చూపిస్తారు. అందుకే అతని కొత్త సినిమా అనౌన్స్ అయిందంటే చాలు, ఇండస్ట్రీలో ఒక రకమైన క్యూరియాసిటీ మొదలవుతుంది. ఇప్పుడు సందీప్ కిషన్‌తో ఆయన చేస్తున్న ‘పవర్‌పేట’ కూడా అదే రేంజ్‌లో ఉండబోతోందని అర్థమవుతోంది.
దర్శకుడిగా తన మార్క్ అగ్రెసివ్ టేకింగ్‌తో ఈసారి ఏలూరు బ్యాక్‌డ్రాప్‌లో ఒక పక్కా పొలిటికల్ గేమ్ ప్లాన్ చేశారు కృష్ణ చైతన్య. సినిమా అనౌన్స్‌మెంట్ కోసం రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పోస్టర్ డిజైన్ చూస్తుంటేనే దర్శకుడు ఏదో పెద్ద మ్యాటరే చెప్పబోతున్నారని క్లారిటీ వచ్చేసింది. ఒక చెస్ బోర్డు, దానిపై చిందిన రక్తం.. ఈ విజువల్స్ సినిమాలోని వైలెన్స్‌ను, పవర్ స్ట్రగుల్‌ను కళ్లకు కడుతున్నాయి.
కేవలం పాలిటిక్స్ మాత్రమే కాదు, ఇందులో ‘ప్రేమ, గౌరవం, పాలిటిక్స్’ అంటూ పెట్టిన ట్యాగ్ లైన్ చూస్తుంటే, అధికారం కోసం జరిగే పోరాటంలో వ్యక్తిగత భావోద్వేగాలు కూడా బలంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఆ రక్తంతో తడిసిన చదరంగం పావులు చూస్తుంటే, ఈ ఆటలో ఎవరెవరు బలైపోతారో అనే ఆసక్తి కలుగుతోంది. పోస్టర్ మధ్యలో ఒక ఎర్ర గులాబీని చూపించడం మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. సాధారణంగా గులాబీ అంటే ప్రేమకు గుర్తు, కానీ ఇక్కడ అది రక్తపు మరకల మధ్య నలిగిపోయి కనిపిస్తోంది. దీన్ని బట్టి సినిమాలో ఒక ఇంటెన్సిటీ ఉన్న ప్రేమకథ కూడా ఉంటుందని, కానీ అది ఈ రాజకీయ చదరంగంలో ఎలా నలిగిపోతుందనేది దర్శకుడు చాలా లోతుగా చూపించబోతున్నారని అర్థమవుతోంది.
కృష్ణ చైతన్య గత చిత్రాల్లో లాగే ఈ సినిమాలో కూడా డైలాగులు చాలా పవర్ఫుల్ గా, నేటి జనరేషన్‌కు నచ్చేలా రియలిస్టిక్ గా ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. సందీప్ కిషన్ కెరీర్ విషయానికి వస్తే, తనను తాను పూర్తిగా కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఈ ‘పవర్‌పేట’ కోసం ఆయన ఫిజికల్ గా చాలా చేంజ్ అవ్వబోతున్నారు. పోస్టర్ లో ఇచ్చిన 'ఇకపై రూల్స్ వద్దు, విజేతలు మాత్రమే..' అనే కొటేషన్ చూస్తుంటే, సినిమాలో సందీప్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్ గా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఈ ప్రాజెక్టును 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి భారీగా నిర్మిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను పట్టాలెక్కించారు. మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి మరో మేజర్ ప్లస్ కానుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మణిశర్మ ఇచ్చే ఎలివేషన్లు ఈ పొలిటికల్ డ్రామాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తాయని చెప్పొచ్చు. శ్రీకర్ ప్రసాద్ లాంటి ఎడిటర్, మది లాంటి కెమెరామెన్ ఈ టీమ్ లో ఉండటం సినిమా రేంజ్ ను మరింత పెంచింది.
ఇక కృష్ణ చైతన్య రాసుకున్న ఈ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇప్పటికే పోస్టర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ టీమ్, త్వరలోనే షూటింగ్ పనులను కూడా వేగవంతం చేయనుంది. ఏలూరు వీధుల్లో ఈ పొలిటికల్ చదరంగం ఏ మలుపులు తిరుగుతుందో తెలియాలంటే మరికొన్ని అప్‌డేట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
