Begin typing your search above and press return to search.

పొట్టేల్ టీజర్.. ఎలా ఉందంటే?

టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల.. మల్లేశం, వకీల్‌ సాబ్‌, మ్యాస్టో వంటి పలు సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 April 2024 1:43 PM GMT
పొట్టేల్ టీజర్.. ఎలా ఉందంటే?
X

టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల.. మల్లేశం, వకీల్‌ సాబ్‌, మ్యాస్టో వంటి పలు సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల తంత్ర మూవీతో ఆడియన్స్ ను అలరించిన ఈ అమ్మడు.. మరో క్రేజీ ప్రాజెక్ట్ పొట్టేల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తుండగా.. సాహిత్‌ మోతుకూరి దర్శకత్వం వహిస్తున్నారు.


ఇప్పటికే బంధం రేగడ్‌, సవారీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాహిత్‌ మోతుకూరి.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పొట్టేల్ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్‌, పాటలు సినీ ప్రియులను తెగ ఆకట్టుకున్నాయి. సినిమాపై మంచి బజ్ కూడా క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. హైదరాబాద్ జరిగిన ఈ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్ ను గమనిస్తే.. కుల వివక్ష ఉన్న ఓ మారుమూల గ్రామంలో యువ చంద్ర కృష్ణ నివసిస్తుంటారు. తన కుమార్తెకు విద్య ద్వారా మంచి జీవితాన్ని అందించాలని కోరుకుంటారు. బాధ్యత గల భర్త, తండ్రిగా ఉంటారు. అనుకోకుండా తన గొర్రె తప్పిపోతుంది. అదే సమయంలో గ్రామస్థులతో ఓ విషయంలో గొడవ జరగడంతో దాడి చేస్తారు. చివరకు ఏం జరిగిందనేది పొట్టేల్ కథగా తెలుస్తోంది.

టీజర్ లో యువ చంద్ర కృష్ణ అమాయకంగా, పాత్రకు తగినట్లుగా కనిపించారు. తన యాక్షన్ తో ఆకట్టుకుంటున్నారు. ఆయన భార్యగా అనన్యకు ముఖ్యమైన పాత్ర దక్కింది. పటేల్ గా అజయ్ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ పోషించారు. టీజర్ చివర్లో ఆయన పోతురాజు గెటప్ హైలెట్ గా నిలిచింది. మొత్తానికి డైరెక్టర్ ప్రతి పాత్రను పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దినట్లు అర్థమవుతుంది. భూపతి రాజు సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఓవరాల్ గా టీజర్.. సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

ఈ మూవీని ఎన్ ఐఎస్ ఏ ఎంటర్టైన్మెంట్స్, ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్ బ్యానర్లపై నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. మరి పొట్టేల్ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి