Begin typing your search above and press return to search.

నంది అవార్డుల‌పై పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

రాష్ట్ర ప్ర‌భుత్వం అందించే నంది అవార్డుల‌ను ఉద్దేశించి న‌టుడు..ఏపీ ఎఫ్ డీసీ చైర్మెన్ పోసాని కృష్ణ ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు

By:  Tupaki Desk   |   23 Dec 2023 9:33 AM GMT
నంది అవార్డుల‌పై పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X

రాష్ట్ర ప్ర‌భుత్వం అందించే నంది అవార్డుల‌ను ఉద్దేశించి న‌టుడు..ఏపీ ఎఫ్ డీసీ చైర్మెన్ పోసాని కృష్ణ ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. నంది అవార్డుల్లో గ‌తంలో ఆయ‌న‌కు అన్యాయం జ‌రిగిందన్నారు. ఆయ‌న మాట్లాడుతూ.. 'ఇప్ప‌టికే నాకు ఓ ప‌దిహేను నందులు రావాలి. న‌టుడి గా..ద‌ర్శ‌కుడి గా..నిర్మాత‌గా...ర‌చ‌యిత‌గా ఎన్నో విభాగాల్లో ప‌నిచేసాను. కానీ గ‌త ప్ర‌భుత్వంలో ఎలాంటి అవార్డు రాలేదు.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం వ‌చ్చాక న‌న్ను చైర్మెన్ ని చేసారు. అర్హులైన‌ వారికే నంది అవార్డు లిస్తాం. క‌ళాకారుల్ని గుర్తింపునిచ్చే ప్ర‌భుత్వం ఇది. నాటక రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్స‌హించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం. వ‌ర్క్ షాపుల్ నిర్వ‌హించి క‌ళాకారుల్ని ప్రోత్స‌హిస్తాం. గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో అన‌ర్హుల‌కే అవార్డ‌లు ద‌క్కాయ‌ని' ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిల్మ్-టీవీ-థియేట‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పోరేష‌న్ ఆధ్వ‌ర్యంలో నంది నాట‌కొత్స‌వాలు శ‌నివారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సంద‌ర్భంగానే పోసాని పై విధంగా స్పందించారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీ స‌హా ప్రేక్ష‌కుల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక నాట‌కొత్స‌వాల్లో భాగంగా మొత్త 73 అవార్డులు ఇవ్వ‌నున్నారు. 38 నాట‌క స‌మాజాల నుంచి 1200 మంది క‌ళాకారులు పాల్గొంటార‌ని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. 'నాట‌క క‌ళాకారుల‌కు అత్య‌త్త‌మ వ‌స‌తులు క‌ల్పించాం. నిరుత్సాహంతో ఉన్న క‌ళాకారుల‌కు ఇది గొప్ప అవ‌కాశం.

రాష్ట్రంలో అంత‌రించిపోతున్న క‌ళ‌ల‌ను స‌జీవంగా ఉండాన‌ల‌న్న‌దే ముఖ్య‌మంత్రి ఆకాంక్ష‌. వీధి నాట‌కాల్ని సైతం ప్రోత్స‌హిస్తున్నాం. వెనుక‌బ‌డిన వ‌ర్గాల నుంచి ఎక్కువ మంది నాట రంగానికి వ‌స్తున్నారు. ప్ర‌భుత్వం అవార్డులు ఇవ్వ‌డం వ‌ల‌న క‌ళాకారుల‌కు మ‌రింత గౌర‌వం ద‌క్కుతుంది. ప్ర‌భుత్వ చిత్త‌శుద్దికి ఇప్పుడు ఇవ్వ‌నున్న అవార్డులు ప్ర‌తిబింబాలు. నాట‌క రంగంలో ఇదొక చారిత్ర‌క ఘ‌ట్టం' అని అన్నారు.