Begin typing your search above and press return to search.

పాప్ స్టార్ రిహన్నాకు వ్వాటే ఫాలోయింగ్!

రిహ‌న్నా జామ్‌నగర్‌కు చేరుకుని ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.

By:  Tupaki Desk   |   2 March 2024 7:12 AM GMT
పాప్ స్టార్ రిహన్నాకు వ్వాటే ఫాలోయింగ్!
X

గుజరాత్‌- జామ్‌నగర్‌లో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పాపుల‌ర్ సెల‌బ్రిటీల‌తో జామ్‌నగర్ జామ్ అయిపోయింది. ప్రస్తుతం దేశంలోని అన్ని రంగాల ప్ర‌ముఖులు ఈ వేదిక వద్ద ఫెస్టివ‌ల్ లో మునిగి తేల్తున్నారు. పాపుల‌ర్ సెల‌బ్రిటీలంతా ఒకే వేదిక వ‌ద్ద అభిమానుల‌కు క‌న్నుల‌పండుగ చేస్తున్నారు. ఇదే వేడుక‌కు అంత‌ర్జాతీయ గాయ‌ని, పాప్ స్టార్ రిహన్నా విచ్చేయ‌డంతో బోలెడంత సందడి నెల‌కొంది. రిహ‌న్నా జామ్‌నగర్‌కు చేరుకుని ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.

రిహన్న ప్రదర్శన ఈ వేడుకల్లో ప్ర‌ధాన హైలైట్. ఇది భారతదేశంలో రిహ‌న్నాకు మొట్టమొదటి ప్రదర్శన కాగా, ఇంత‌కుముందు అంబానీ కుమార్తె పెళ్లిలోను ఇత‌ర పాప్ సెల‌బ్రిటీలు పెర్ఫామ్ చేసారు. రిహన్నా ఈ ఈవెంట్ కోసం ఏకంగా 70 కోట్లు అందుకుంటుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బ‌హుశా ఒక విదేశీ సెల‌బ్రిటీకి ఒక షో కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఇచ్చిన ఏకైక కుటుంబంగా అంబానీల కుటుంబం రికార్డుల‌కెక్కింది. శనివారం తెల్లవారుజామున జామ్‌నగర్‌ను విడిచి వెళుతున్న ఫోటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. జామ్‌నగర్ విమానాశ్రయంలో రిహన్నా పోలీసులతో పోజులిచ్చిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోలీసు అధికారులు అంతర్జాతీయ గాయనికి భ‌ద్ర‌తా సిబ్బందిగా విచ్చేసారు. అదే క్ర‌మంలో ఇలా ఫోటో దిగినందుకు వారంతా చాలా ఆనందం వ్య‌క్తం చేసారు. రిహన్నా వినయపూర్వకమైన స్వభావం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక పారితోషికం అందుకునే పాప్ సెల‌బ్రిటీగా రిహన్నా క్రేజ్ స్కైని ట‌చ్ చేస్తోంది. ఏది ఏమైనా అంబానీల పెళ్లి కోసం రిహ‌న్నా అందుకున్న పారితోషికంతో దేశంలోని వందలాది గుడులు గోపురాల‌లో వేలాదిగా ఉన్న‌ పేద‌ల‌కు ఉచిత సామూహిక పెళ్లిళ్లు చేయ‌డం చాలా సులువు.