Begin typing your search above and press return to search.

స్టార్‌ సింగర్‌.. గంజాయితో నా జీవితం నాశనం!

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు డ్రగ్స్ మరియు గంజాయి వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   1 April 2024 4:53 AM GMT
స్టార్‌ సింగర్‌.. గంజాయితో నా జీవితం నాశనం!
X

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు డ్రగ్స్ మరియు గంజాయి వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డ, గంజాయి పట్టుబడ్డ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధాలు ఉంటున్నాయి. సెలబ్రిటీలు వెళ్లే పబ్‌ లు మరియు క్లబ్ ల్లో కచ్చితంగా వాటి వినియోగం జరుగుతుందని అందరూ అనుకుంటూ ఉన్నారు.

తాజాగా ఎంతో మంది సెలబ్రిటీలు కూడా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారు. డ్రగ్స్ వాడొద్దు అంటూ అవగాహణ కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గంజాయి తో తన జీవితం నాశనం అయ్యిందని, దాదాపు అయిదు సంవత్సరాల పాటు తన జీవితాన్ని కోల్పోయాను అంటూ స్టార్‌ ర్యాప్ సింగర్‌ హనీ సింగ్ అన్నాడు.

తాజాగా ఒక కార్యక్రమంలో హనీ సింగ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంజా తీసుకోవడం వల్ల తన జీవితంలో అత్యంత కీలకమైన ఐదేళ్ల సమయంను కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. గంజా అనేది అస్సలు మంచి అలవాటు కాదు అన్నట్లుగా హనీ సింగ్ పేర్కొన్నాడు.

తన అభిమానులు ఎవరు కూడా గంజా ను తీసుకోవద్దు అన్నాడు. ఎవరికి ఇష్టం వచ్చిన డ్రింక్ వారు తాగండి. అంతే కానీ గంజా ను అస్సలు ముట్టుకోవద్దు అంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు. సెలబ్రిటీ లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా డ్రగ్స్ మరియు గంజా కేసుల్లో పట్టుబడుతున్న నేపథ్యంలో హనీ సింగ్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

పాపులర్ ర్యాపర్ గా గుర్తింపు దక్కించుకున్న హనీ సింగ్ గంజా కేసు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాన్ని వదిలించుకోవడానికి కూడా ఇబ్బందులు పడ్డాడట. అందుకే తన తోటి వారికి గంజాకి దూరంగా ఉండాలంటూ సలహా ఇస్తున్నాడు.