Begin typing your search above and press return to search.

పాపుల‌ర్ గాయ‌కుడితో 100 కోట్ల డీల్ క్యాన్సిల్

ఇవన్నీ అతడిని దోషిగా నిర్ధారించిన వెంటనే కాంట్రాక్టులు ర‌ద్దు చేసుకుని, సంబంధాలను తెంచుకున్నాయి. సుమారు 100 కోట్లు పైగా విలువ చేసే కాంట్రాక్టుల‌ను అత‌డు కోల్పోయాడ‌ని విశ్లేషిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 2:30 PM GMT
పాపుల‌ర్ గాయ‌కుడితో 100 కోట్ల డీల్ క్యాన్సిల్
X

పాపుల‌ర్ పాప్ గాయ‌కుడు అత్యాచారం కేసులో అరెస్ట‌య్యాడు. ఫ‌లితంగా అత‌డి నుంచి కార్పొరెట్ అడ్వాన్సులు వెన‌క్కి తీసుకుంది. అత‌డితో దాదాపు 100 కోట్ల మేర డీల్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇది అత‌డికి తీర‌ని న‌ష్టం. ఇంత‌కీ అత‌డు ఎవ‌రు? చేసిన నేరం ఏమిటి? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

ఇదంతా చైనా-కెనడియన్ పాప్ స్టార్ క్రిస్ వు గురించి. అత‌డికి అత్యాచారం కేసులో 13 ఏళ్ల జైలు శిక్షను నంబర్ 3న‌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు (బీజింగ్) సమర్థించింది. వు నవంబర్ 2022లో దోషిగా నిర్ధారింప‌బ‌డ్డాడు. బీజింగ్ చాయోయాంగ్ జిల్లా పీపుల్స్ కోర్ట్ అత్యాచారం అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొన్నందుకు అమాయ‌క జనాన్ని సమీకరించినందుకు వూకి జైలు శిక్ష విధించింది. ఖైదు ముగింపులో అతడు బహిష్కారానికి గుర‌వుతాడు. వు ఇప్ప‌టికే ఇంటర్మీడియట్ కోర్టులో అప్పీలు చేసాడు. ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో వినిపించింది. ఈ కేసులో ఇప్ప‌టికే సమర్పించిన సాక్ష్యాలు సరిపోతాయని, శిక్ష సహేతుకమైనదని కోర్టు పేర్కొంది.

18 ఏళ్ల చైనీస్ విద్యార్థి తనతో పాటు 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇతర బాలికలతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని బహిరంగంగా ఆరోపించడంతో వు జూలై 2021లో నిర్బంధించబడ్డారు. 'వు ..' అశ్లీల కార్యకలాపాలలో పాల్గొనడానికి ఒక గుంపును సేకరించి, రింగ్‌లీడర్‌గా ఉన్నాడని, అందువల్ల అతని ప్రవర్తన సమూహ లైసెన్సియస్‌నెస్ నేరంగా పరిగణించబడుతుందని, దీంతో అసలు తీర్పును కొనసాగిస్తుందని కోర్టు పేర్కొంది. మహిళల మద్యపాన వ్య‌స‌నాన్ని షాకుగా ఉప‌యోగించి వారితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నందుకు వూ దోషిగా నిల‌బ‌డ్డాడు.

వు బంధువులు ..కెనడియన్ ఎంబసీ నుండి కొంద‌రు అధికారులు వు తీర్పు ప్రకటనకు హాజరయ్యారు. పాప్ స్టార్- వు 2017 చిత్రం 'XXX: రిటర్న్ ఆఫ్ అలెక్జాండర్ కేజ్‌'తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అతడు బల్గారీ, లాంకోమ్, లూయిస్ విట్టన్, పోర్స్చే సహా 15 లగ్జరీ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉన్నాడు. ఇవన్నీ అతడిని దోషిగా నిర్ధారించిన వెంటనే కాంట్రాక్టులు ర‌ద్దు చేసుకుని, సంబంధాలను తెంచుకున్నాయి. సుమారు 100 కోట్లు పైగా విలువ చేసే కాంట్రాక్టుల‌ను అత‌డు కోల్పోయాడ‌ని విశ్లేషిస్తున్నారు.