Begin typing your search above and press return to search.

వాళ్ల దెబ్బ‌కి సినిమా వాళ్లే షాక్ అవుతున్నారు!

స‌గ‌టు ప్రేక్ష‌కుడికి సినిమా ఎంత భార‌మైంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. పెరిగిన టికెట్ ధ‌ర‌లు..అంత‌కు మించి మ‌ల్టీప్లెక్స్ ల్లో పాప్ కార్న్, స్నాక్స్ ధ‌ర‌లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.

By:  Tupaki Desk   |   25 Dec 2025 7:00 PM IST
వాళ్ల దెబ్బ‌కి సినిమా వాళ్లే షాక్ అవుతున్నారు!
X

స‌గ‌టు ప్రేక్ష‌కుడికి సినిమా ఎంత భార‌మైంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. పెరిగిన టికెట్ ధ‌ర‌లు..అంత‌కు మించి మ‌ల్టీప్లెక్స్ ల్లో పాప్ కార్న్, స్నాక్స్ ధ‌ర‌లు చూస్తే షాక్ అవ్వాల్సిందే. టికెట్ ధ‌ర కంటే పాప్ కార్న్ ధ‌ర మూడు రెట్లు అధికంగా ఉంటున్నాయి. అదే పాప్ కార్న్ రోడ్డు మీద కొంటే 10 రూపాయ‌లు. మ‌ల్లీప్లెక్స్ పేరిట చేస్తోన్న దోపిడి అది దీంతో థియేట‌ర్ ఆక్యుపెన్సీగా పెద్ద‌గా ఉండ‌టం లేదు. ఎంత పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అయినా? స‌రే ధ‌ర‌లు త‌గ్గిన త‌ర్వాత చూద్దామ‌నే నిర్ణ‌యానికి వ‌చేసారు. ఏపీలో గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఇలాంటి వాటికి చెల్లు చీటు ప‌డింది.

కానీ ప్ర‌భుత్వం మారే స‌రికి సీన్ మారిపోయింది. తాజాగా ఈ అంశంపై ద‌ర్శ‌కుడు తేజ సైతం త‌న అనుభ‌వాన్ని చెప్పుకొచ్చాడు. కోట్ల రూపాయాలు పారితోషికం తీసుకునే తాను కూడా ఒకింత విస్తుపోయాన‌న్నారు. పెరిగిన పాప్ కార్న్ ధ‌ర‌లు క‌చ్చితంగా త‌గ్గాల‌న్నారు. ప్ర‌తీవారం సినిమాకు వెళ్లే నేను ఇప్పుడు థియేటర్‌కు వెళ్లాలంటే భయపడుతున్నాన‌న్నారు. వెళ్లినా సినిమా చూసి వ‌చ్చేయ‌డం త‌ప్ప పాప్ కార్న్ కొన‌డం లేద‌న్నారు.

ప్ర‌భుత్వం పేద‌ల‌కు కూడా సినిమాను ద‌గ్గ‌ర చేయాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. కేవ‌లం సంప‌న్న వ‌ర్గాల‌కే సినిమా ప‌రిమితం కాకూడ‌ద‌న్నారు.

ప్రేక్షకులకు అందుబాటులో ధరలు ఉంచుతూనే, ఇండస్ట్రీలోని వారికి నష్టం రాకుండా ఉంటుద‌న్నారు. దీనికి సంబంధించి ఎలా సమన్వయం చేయాలనే దానిపై కమిటీ త‌మ సలహాలు కూడా కోరిందన్నారు. స్టోరీ రాసిన ద‌గ్గ‌ర నుంచి థియేట‌ర్ వ‌ర‌కూ అన్ని రంగాల్లో త‌న‌కు అనుభ‌వం ఉంది కాబ‌ట్టి త‌న అభిప్రాయాన్ని ఓపెన్ గా పంచుకున్నాన‌న్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల హేతుబద్ధీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం సంద‌ర్భంగానే తేజ ఓపెన్ అయ్యారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సినీ పరిశ్రమ తరఫున నిర్మాత వివేక్ కూచిబొట్ల, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అలంకార్ ప్రసాద్, దర్శకుడు తేజ, డిస్ట్రిబ్యూటర్ సాయి బాబు తదితరులు పాల్గొన్నారు.

మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరల విధానం, భారీ బడ్జెట్ చిత్రాలకు ధరల పెంపు వంటి అంశాలపై కమిటీ సినీ ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. వీట‌న్నింటి ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. ఇటీవ‌లే తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కూడా టికెట్ ధ‌ర‌లు పెంచమంటూ త‌న వ‌ద్ద‌కు ఎవ‌రూ రావొద్ద‌ని కూడా ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో హైకోర్టు ప్ర‌భుత్వంపై సీరియ‌స్ అవ్వ‌డంతో ఆ శాఖ‌కు కూడా అలెర్ట్ అయింది.