Begin typing your search above and press return to search.

అమ్మ మాట నిజమైంది.. భర్త విషయంలో పూర్ణ కన్నీళ్లు!

ప్రముఖ నటి పూర్ణ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మలయాళీ ముద్దుగుమ్మ అయినప్పటికీ తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   10 Dec 2025 9:33 AM IST
అమ్మ మాట నిజమైంది.. భర్త విషయంలో పూర్ణ కన్నీళ్లు!
X

ప్రముఖ నటి పూర్ణ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మలయాళీ ముద్దుగుమ్మ అయినప్పటికీ తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం. రవిబాబు స్వీయ దర్శకత్వంలో వచ్చిన హారర్ మూవీ అవును చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈమె.. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత పలువురు హీరోల సరసన నటించిన పూర్ణ.. అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మార్చుకుంది. అలా అఖండ, దృశ్యం 2 వంటి చిత్రాలలో తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకవైపు నటిగానే కాకుండా మరొకవైపు బుల్లితెర డాన్స్ షోలలో జడ్జిగా కూడా కనిపించి, బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించింది. కెరియర్ పీక్స్ లో కొనసాగుతున్న సమయంలోనే దుబాయ్ కి చెందిన జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షనిద్ అసిఫ్ అలీతో 2022 అక్టోబర్ 25న ఏడు అడుగులు వేసింది.

వివాహం అనంతరం పండంటి కొడుకుకు జన్మనిచ్చింది పూర్ణ. కొడుకు ఆలనా పాలన చూసుకోవడానికి కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. మళ్లీ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం అనే సినిమాలో "కుర్చీ మడతపెట్టి" అనే స్పెషల్ సాంగ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అడపా దడపా సినిమాలలో నటిస్తున్న పూర్ణ తాజాగా తన జీవితంలో ఈరోజు మర్చిపోలేనిది అని, తన తల్లి చెప్పిన మాట నిజమయింది అని అల్లా తనకెప్పుడూ తోడుగా ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం అంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక సుదీర్ఘ పోస్ట్ తో పాటు కొన్ని ఫోటోలను కూడా పంచుకుంది.

అసలు విషయంలోకి వెళ్తే.. పూర్ణ శాస్త్రీయ నృత్యకారిణి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకముందు "సూపర్ డాన్సర్" అనే డాన్స్ కాంపిటీషన్లో పాల్గొని సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత నటిగా అడుగుపెట్టిన ఈమె.. ఇక ఎక్కడ నృత్య ప్రదర్శన ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ క్యాప్షన్ పంచుకుంది పూర్ణ.

"నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. మా అమ్మ కృషి, అంకితభావం కారణంగానే నేను ఒక నృత్యకారిణిగా మారగలిగాను. ఆమె బలం, మద్దతు ఎల్లప్పుడూ నాకు పునాదిగా నిలిచాయి. నేను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నా తల్లిలాగే నా నృత్యానికి మద్దతు ఇచ్చే భాగస్వామిని కనుగొనమని అల్లాని ప్రార్థించాను. మా అమ్మ నువ్వు కోరుకున్న కలలు నెరవేరేలా చూసే వ్యక్తి నీకు భర్తగా రావాలని ఆశీర్వదించింది. అటు అమ్మ కల , నా కల రెండింటిని భగవంతుడిని నిజం చేశారు. నా భర్త ఒక సనాతన కుటుంబం నుండి వచ్చినప్పటికీ నాకు మద్దతుగా నిలిచారు. ఆయన నా పక్కన ఉన్నందుకు నేను ఎంత ధన్యురాలినో మాటల్లో చెప్పలేను. కులం, నేపథ్యం తేడాల గురించి కాదు మనిషిగా ఉండడం.. ఒకరి పట్ల ఒకరు ప్రేమ గౌరవం చూపించడం.. అతని మంచి మనసుకు ప్రతీకగా నిలుస్తోంది" అంటూ తన భర్త యొక్క మంచి మనసును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది పూర్ణ. ఇక ప్రస్తుతం పూర్ణ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.